తెలిసిందేగా : ఎన్డీయేలోకి అన్నాడీఎంకే!

సార్వత్రిక ఎన్నికల్లో పాత మిత్రుల కోసం డోర్లు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి 24 గంటలైనా కాకముందే తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు

  • Published By: venkaiahnaidu ,Published On : January 11, 2019 / 11:01 AM IST
తెలిసిందేగా : ఎన్డీయేలోకి అన్నాడీఎంకే!

సార్వత్రిక ఎన్నికల్లో పాత మిత్రుల కోసం డోర్లు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి 24 గంటలైనా కాకముందే తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు

సార్వత్రిక ఎన్నికల్లో పాత మిత్రుల కోసం డోర్లు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి 24 గంటలైనా కాకముందే తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.  అన్నాడీఎంకే   జాయింట్ కో ఆర్డినేటర్ గా కూడా పళనిస్వామి వ్యవహరిస్తున్నారు.

ఎవరైతే తమ రాష్ట్రానికి మంచి చేస్తారో వారికి రాష్ట్రంలోని అధికార పార్టీ మద్దతిస్తుందని పరోక్షంగా ఎన్డీయేతో పొత్తు ఉంటుందని సీఎం తెలిపారు. జయలలిత మరణం తర్వాత మోడీ ప్రభుత్వంతో అన్నాడీఎంకే సన్నిహితంగా ఉంటున్న విషయం. తమిళనాడు ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ లో ఉందని, రిమోట్ ప్రధాని మోడీ దగ్గర ఉందని,  మోడీ చెప్పుచేతల్లో తమిళనాడు ప్రభుత్వం ఉందంటూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా అనేక సందర్భాల్లో విమర్శించారు. పన్నీరుస్వెలం, పళనిస్వామిల మధ్య విభేధాాలు కూడా మోడీ జోక్యంతో మాసిపోయాయని అందరికీ తెలిసిందే.

శుక్రవారం చెన్నైలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పళనిస్వామి మాట్లాడుతూ… కేంద్రంలో తమిళనాడుని సపోర్ట్ చేసే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అదే తమ విధానమని ప్రకటించారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమిళనాడు ప్రజలకు మంచి చేస్తే తాము మద్దతిస్తామని తెలిపారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా మోసం చేయాలని చూస్తే మాత్రం సహించబోమని తెలిపారు. మాజీ సీఎంలు ఎమ్ జీ రామచంద్రన్, జయలలితల అడుగుజాడల్లోనే పార్టీ నడుస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పైనా కూడా సీఎం విమర్శలు చేశారు. స్టాలిన్ ప్రస్తుతం గ్రామ్ సభ పేరుతో మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నారని, కానీ ఆయన పురపాలక శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ గ్రామాల్లో పర్యటించలేదని సీఎం విమర్శించారు.

యూపీఏ కూటమిలో తాము చేరబోతున్నట్లు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. మా ప్రధాని అభ్యర్థి రాహులే అంటూ ఇటీవల స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విసయం తెలిసిందే. అయితే ఇప్పుడు అన్నాడీఎంకే త్వరలో చేరనుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ, డీఎంకే-కాంగ్రెస్ లు కలిసి పోటీ చేయనున్నట్లు తంబీలు చెబుతున్నారు.