Irrigation Projects : సంచలన నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి

తెలుగు రాష్ట్రాల జల పంచాయితీపై కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. జల వివాదాలకు స్వస్తిపలికేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. కృష్ణా నదిపై ఉన్న 36 ప్రాజెక్టులు, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు ఇకపై కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ తో సహా అన్ని ప్రాజెక్టుల నిర్వహణను ఆయా బోర్డులే చూసుకోనున్నాయి.

Irrigation Projects : సంచలన నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి

Irrigation Projects

Irrigation Projects : తెలుగు రాష్ట్రాల జల పంచాయితీపై కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. జల వివాదాలకు స్వస్తిపలికేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. కృష్ణా నదిపై ఉన్న 36 ప్రాజెక్టులు, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు ఇకపై కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ తో సహా అన్ని ప్రాజెక్టుల నిర్వహణను ఆయా బోర్డులే చూసుకోనున్నాయి.

దీనికి సంబంధించి కృష్ణా, గోదావరి నది యాజమాన్యం బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ గురువారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాలకు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గెజిట్ లో ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ అనే అంశాలు పొందుపరిచారు. కృష్ణా నదికి గోదావరి నదికి వేరువేరుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 14 నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది.

ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా అన్నింటి నిర్వహణను ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయి. ఒక్కో రాష్ట్రము ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల రూపాయల చొప్పున 60 రోజుల్లో సీడ్ మణి కింద డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల లోపు చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఈ నోటిఫికేషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలి ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తైన వాటిని నిలిపి వెయ్యాల్సి ఉంటుంది.

ఇక ప్రాజెక్టుల హెడ్ వర్క్స్, బ్యారేజీలు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్ నిర్మాణాలు, కెనాల్ నెట్వర్క్స్, ట్రాన్స్మిషన్ లైన్లు కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి వస్తాయని జలశక్తి శాఖ తెలిపింది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు విద్యుతు ఉత్పత్తిని బోర్డే స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల అమలును బోర్డు చూస్తుంది.