Covid Vaccine : మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్

మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన అందరికి వ్యాక్సిన్ వేయనున్నారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Covid Vaccine : మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్

మే 1 నుంచి

18 years Covid Vaccine :  దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

వ్యాక్సినేష‌న్ మూడో ద‌శ‌లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచాల‌ని ఈ కీల‌క నిర్ణయం తీసుకుంది. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో సోమ‌వారం ప్ర‌ధాని నరేంద్ర మోడీ వ‌రుస స‌మావేశాల్లో పాల్గొన్నారు.


ఈ స‌మావేశాల్లోనే 18 ఏళ్ల పైబ‌డిన అంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాలనే నిర్ణ‌యం తీసుకున్నారు.  మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన అందరికి వ్యాక్సిన్ వేయనున్నారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 45ఏళ్లు పైబడిన వారికే కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచే రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవచ్చునని కేంద్రం పేర్కొంది.

రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా వ్యాక్సిన్ వినియోగానికి వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపింది. వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తిలో 50శాతం రాష్ట్రాలకు, బహిరంగ మార్కెట్ లోకి విడుదల చేసుకోవచ్చునని పేర్కొంది. కేంద్రం ఇచ్చే డోసులకు అదనంగా కావాలంటే వ్యాక్సిన్ తయారీదారులు నుంచి రాష్ట్రాలు కొనుక్కోవచ్చు. వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలంటూ కేంద్రంపై కొంతకాలంగా ఒత్తిడి పెరిగింది.