ముస్లింలు పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపండి : రాహుల్ కి షా సవాల్

పౌరసత్వ సవరణ చట్టంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపాలంటూ సవాల్ విసిరారు

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 03:12 AM IST
ముస్లింలు పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపండి : రాహుల్ కి షా సవాల్

పౌరసత్వ సవరణ చట్టంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపాలంటూ సవాల్ విసిరారు

పౌరసత్వ సవరణ చట్టంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపాలంటూ సవాల్ విసిరారు హోంమంత్రి అమిత్‌షా. దీనికి ఘాటుగానే సమాధానం ఇచ్చారు రాహుల్.. ప్రియాంక..

రాహుల్ కి సవాల్ :
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనకారులకు కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాల వైఖరిని కేంద్రం తప్పుపడుతోంది. సీఏఏ వల్ల ఏ ఒక్కరూ పౌరసత్వాన్ని కోల్పోరని హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. అలాంటి నిబంధన ఏదైనా చట్టంలో ఉంటే చూపించాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఈ విషయంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.

పేదలపై మరో పన్ను NRC, NPR:
ఎన్‌ఆర్‌సీ…ఎన్‌పీఆర్‌ భారత దేశంలోని పేదలపై మోపే ఓ పన్ను లాంటిదన్నారు రాహుల్‌ గాంధీ. నోట్ల రద్దు పేరిట పేదలను దోచుకున్నట్లే…ఎన్‌ఆర్‌సీ…ఎన్‌పీఆర్‌ పేరిట పేదలు దోపిడీకి గురవుతారని రాహుల్ కొత్త భాష్యం చెప్పారు. 

యువత ఆందోళన విరమించే ప్రసక్తి లేదు:
పౌరసత్వ సవరణ చట్టంపై ప్రియాంకా గాంధీ మరోసారి మోడీ సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. యువత ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదన్నారు. మోడీ సర్కార్‌ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశారు ప్రియాంక. మోడీ మొదట 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెబుతారు… ఆ తర్వాత విశ్వవిద్యాలయాలను నాశనం చేస్తారు. ఆ తర్వాత  రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తారు. మళ్లీ మీరు ఆందోళన చేస్తారు. అపుడు మిమ్మల్ని ఫూల్‌ అంటారంటూ యూత్‌ను ఉద్దేశించి చెప్పారు. అటు అమిత్‌ షా ఇటు.. రాహుల్-ప్రియాంకలు ఢీ అంటే ఢీ అంటుండడంతో.. పౌరసత్వ రగడ రోజురోజుకూ హీట్ పెరుగుతూనే ఉంది. 

* సీఏఏపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం 
* పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షాలు
* సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపాలన్న షా
* సీఏఏపై మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన ప్రియాంకా గాంధీ
* కేంద్రం ఎంత ప్రయత్నించినా.. యువత ఆందోళన విరమించదు 
* ఎన్‌ఆర్‌సీ…ఎన్‌పీఆర్‌ పేదలపై మోపే పన్ను లాంటిది- రాహుల్

Also Read : అలర్ట్ : కొత్త సంవత్సరంలో తేదీతో జాగ్రత్త