Amritpal Singh: ఎట్టకేలకు దొరికాడు..! అమృత్ పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన మోగా పోలీసులు

ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్ పాల్ సింగ్ లొంగిపోయాడు. పంజాబ్‌లోని మోగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు.

Amritpal Singh: ఎట్టకేలకు దొరికాడు..!  అమృత్ పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన మోగా పోలీసులు

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు దొరికిపోయాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పంజాబ్‌లోని మోగా పోలీసుల ఎదుట అమృత్‌పాల్ లొంగిపోయాడు. అర్థరాత్రి సమయంలో మెగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన పోలీసుల వద్ద సరెండర్ అయ్యాడు. దీంతో అమృత్ పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన మోగా పోలీసులు.. అతన్ని అస్సాంలోని దిబ్రూఘర్‌ జైలుకి తరలించినట్లు సమాచారం. గత కొన్నిరోజులుగా అమృత్ పాల్ పరారీలో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు విడుదల చేస్తూ.. పంజాబ్ పోలీసులకు సవాల్ విసురుతూ వచ్చాడు. బైశాఖీ సందర్భంగా పోలీసుల వద్ద లొంగిపోతానని ఆయన గతంలో చెప్పినప్పటికీ అలాజరగలేదు. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో ఎటూ పోలేని పరిస్థితుల్లో రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్న అమృత్ పాల్.. ఇక పోలీసుల కళ్లుగప్పి పారిపోయే పరిస్థితి లేకపోవటంతో మోగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది.

Khalistani separatist Amritpal SinghKhalistani separatist Amritpal Singh

ఖలిస్థానీ సానుభూతి పరుడు అమృత్ పాల్ సింగ్ కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. అయితే, లవ్‌ప్రీత్ సింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో అమృత్‌పాల్ సింగ్ అనుచరులు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. దీంతో లవ్‌ప్రీత్‌ను పోలీసులు వదిలివేయాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  యువతను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై అమృత్ పాల్ పై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మార్చి 18 నుంచి పోలీసులు అతనికోసం గాలింపు మొదలు పెట్టారు. అప్పటి నుంచి అమృత్ పాల్ సింగ్ పోలీసులకు చిక్కకుడా పారిపోతూ వస్తున్నాడు.

Amritpal Singh: అమృత్‌పాల్ ఎక్కడ? తలలు పట్టుకుంటున్న పోలీసులు.. ఏప్రిల్ 14వరకు సెలవులు రద్దు

మారు వేషాల్లో తిరుగుతూ..

అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మారు వేషాల్లో తిరుగుతూ వచ్చాడు. మారువేషంలో ఢిల్లీ వీధుల్లో అమృత్ పాల్ తిరిగినట్లు సీసీ పుటేజీల్లో రికార్డయ్యాయి. అందులో అమృత్ పాల్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తలపాగా లేకుండా కనిపించాడు. సన్ గ్లాసెస్ ధరించాడు. అయితే, అమృత్ పాల్ సింగ్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. నేపాల్, పాకిస్థాన్, సింగపూర్ వంటి దేశాలకు అతను పారిపోవాలని ప్రయత్నించాడని తెలిసింది. అప్పటికే ప్రముఖ విమానాశ్రయాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు, సరిహద్దుల్లో బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీనికితోడు దేశవ్యాప్తంగా అమృత్ పాల్ కోసం పోలీసులు నిఘా ఉంచారు. దీంతో ఎటూ పారిపోలేని పరిస్థితుల్లో మళ్లీ అమృత్ పాల్ పంజాబ్ వచ్చి తలదాచుకోవాల్సి వచ్చింది.

Amritpal Singh: లండన్ పారిపోతున్న అమృతపాల్ సింగ్ భార్యను ఎయిర్‭పోర్టులో పట్టుకున్న అధికారులు

అమృత్ పాల్ సింగ్ పంజాబ్‌లో ఉంటూ సోషల్ మీడియా వేదికల ద్వారా వీడియోలు విడుదల చేస్తూ వచ్చాడు. అయితే, ఏప్రిల్ మొదటి వారంలో అతను పోలీసుల ఎదుట లొంగిపోతాడని వార్తలు వచ్చాయి. కానీ, అమృత్ పాల్ తప్పించుకు తిరుగుతూనే వచ్చాడు. అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్ననాటి నుంచి అతని అనుచురులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేస్తూ వచ్చారు. ఇటీవల అతని ప్రధాన అనుచరులనుసైతం పోలీసులు అరెస్టు చేశారు. దీనికితోడు లండన్ కు పారిపోయేందుకు ప్రయత్నించిన అతని భార్య కిరణ్ దీప్‌కౌర్‌ను ఈ నెల 20న శ్రీగురురామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.

 

అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన తరువాత పంజాబ్ పోలీసులు ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ధృవీకరించారు. అమృత్ పాల్‌ను మోగా పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రజలకు పోలీసులు ఓ విజ్ఞప్తి చేశారు. శాంతి, సామరస్యాలను కాపాడాలని, ఎలాంటి తప్పుడు వార్తలను షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.