Kiren Rijiju: ఆప్ రాజకీయ లాభానికి అన్నా హజారేను ఉపయోగీంచుకున్నారట.. కేంద్ర మంత్రి రిజుజు కామెంట్స్

ఢిల్లీ లిక్కర్ స్కాంను అన్నా హజారే వ్యతిరేకించినట్లుగా ఉంది. ‘‘ఈడీ, సీబీఐలకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తారా? ఒకవేళ కోర్టులో కూడా మీకు వ్యతిరేక తీర్పు వస్తే అప్పుడు కూడా కోర్టుకు వెళ్తారా?’’ అని ఒక ట్వీట్ చేశారు

Kiren Rijiju: ఆప్ రాజకీయ లాభానికి అన్నా హజారేను ఉపయోగీంచుకున్నారట.. కేంద్ర మంత్రి రిజుజు కామెంట్స్

Kiren Rijiju

Kiren Rijiju: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను రాజకీయ లాభం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ వాడుకుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ ముందు విచారణ ఎదుర్కొన్నారు. ఇదే సందర్భంలో రిజుజు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అన్నా హజారేతో కేజ్రీవాల్ పాల్గొన్నారని, అయితే అన్నా పేరును ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ది పొందారని రిజుజు అన్నారు.

Atiq Ahmed Murder: అతిక్ అహ్మద్‭పై కాల్పులు జరిపిన ముగ్గురిపై అనేక కేసులు.. తమకేమీ తెలియదంటున్న కుటుంబ సభ్యులు

తీరా అధికారంలోకి వచ్చాక.. తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయారని రిజుజు విమర్శించారు. అన్నా హజారే ఏదో సందర్భంలో మాట్లాడిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అందులో ఢిల్లీ లిక్కర్ స్కాంను అన్నా హజారే వ్యతిరేకించినట్లుగా ఉంది. ‘‘ఈడీ, సీబీఐలకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తారా? ఒకవేళ కోర్టులో కూడా మీకు వ్యతిరేక తీర్పు వస్తే అప్పుడు కూడా కోర్టుకు వెళ్తారా?’’ అని ఒక ట్వీట్ చేశారు. ఇక అన్నా వీడియో షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు వారు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అన్నాజీ మాట కూడా వినరు. అవినీతి ఒక సాకు. అన్నాజీ, ప్రజలను మోసం చేశారు’’ అని రాసుకొచ్చారు.