Amritsar Golden Temple : స్వర్ణదేవాలయం సమీపంలో మరో పేలుడు .. హడలిపోతున్న స్థానికులు

పంజాబ్ స్వర్ణదేవాలయం సమీపంలో మరోసారి పేలుడు సంభవించింది. 24 గంటల్లో రెండుసార్లు పేలుడు జరగటంతో ఆ ప్రాంతంలో భద్రతనుపెంచారు.

Amritsar Golden Temple : స్వర్ణదేవాలయం సమీపంలో మరో పేలుడు .. హడలిపోతున్న స్థానికులు

Amritsar Golden Temple

Amritsar Golden Temple : పంజాబ్ (Punjab) లోని గోల్డెన్ టెంపుల్ (Amritsar Golden Temple) సమీపంలో మరో పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం హెరిటేజ్ స్ట్రీట్ (Heritage Street)లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి భవనం గాజు తలుపులు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మరునాడే అంటే సోమవారం (మే 8,2023) ఉదయం 6.30గంటలకు అమృత్ సర్ గోల్డెన్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ లో మరోపేలుడు సంభవించింది. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనతో బాంబుస్వ్కాడ్, ఎఫ్ఎస్ఎల్ బృందాలు హుటాహుటినా చేరుకున్నాయి.

పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో  24 గంటల్లో రెండుసార్లు పేలుడు సంభవించిటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒకే చోట వరుసగా పేలుళ్లు జరగడంతో ఆ ప్రాంతంలో పోలీసులు మరింత భద్రతను పెంచారు. ఈ పేలుడు వెనక కారణమేంటో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని..స్థానికులు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని అమృత్‌సర్ పోలీసులు సూచిస్తున్నారు.

సోమవారం పేలుడు ఘటనపై కరణ్ దీప్ సింగ్ అనే భక్తుడు మాట్లాడుతు.. పేలుడు ధాటికి భవనం గాజు తలుపు పగిలిపోయాయని ఆ గాజు ముక్కలు ఆటోలో ప్రయాణించే కొంతమంది యువతులకు తగిలి స్వల్పంగా గాయాలు అయ్యాయని తెలిపాడు. హర్యానాలోని పంచకుల నుంచి గోల్డెన్ టెంపుల్ కు వచ్చారని వారికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపాడు. కాగా ఆదివారం జరిగిన పేలుడు రెస్టారెంట్ చిమ్నీలో జరిగిందని పోలీసులు తెలిపారు.