Delhi Lodhi Art District : భారత ప్రజల మనసు దోచుకోవడం ఎలానో యాపిల్ సీఈవోకి తెలుసు.. ఢిల్లీ పర్యటనలో ఆయన ఏం చేసారంటే?

టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇండియా వచ్చారు. ఢిల్లీ పర్యటనలో లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్ లోని చిత్రాలను చూసి ఆయన ఫిదా అయిపోయారు. వాటిని చూసి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Delhi Lodhi Art District : భారత ప్రజల మనసు దోచుకోవడం ఎలానో యాపిల్ సీఈవోకి తెలుసు.. ఢిల్లీ పర్యటనలో ఆయన ఏం చేసారంటే?

Delhi Lodhi Art District

Delhi Lodhi Art District :  యాపిల్ సీఈవో టిమ్ కుక్‌కి (tim cook) ఢిల్లీలోని లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్ (Lodhi Art District) తెగ నచ్చేసింది. ఢిల్లీలో కొత్త స్టోర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడి ఆర్ట్స్ చూసి అబ్బురపడ్డారు.

Tim Cook : యాపిల్ సీఈఓతో సందడి చేసిన ఇండియన్ సినీ సెలబ్రిటీలు..

ఢిల్లీ, ముంబయిలలో యాపిల్ కంపెనీ తమ నూతన స్టోర్స్ ప్రారంభించబోతోంది. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఢిల్లీకి వచ్చారు. లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్ లోని సెయింట్ + ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ (St+art India Foundation) వేసిన చిత్రాలు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంలో చిత్రాలను వేసిన కళాకారులను ఆయన అభినందించారు. తాను చూసిన చిత్రాలను స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఢిల్లీలోని లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్ చాలా అద్భుతమైన ప్లేస్ అని.. అలాంటి ప్రదేశాన్ని సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉందని.. సెయింట్ + ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ కు , అక్కడ ఆర్ట్ వేసిన కళాకారులకు అభినందనలు అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. తనకు ఐప్యాడ్ లో అక్కడ చిత్రాలు ఎలా గీస్తారో చూపించిన ఆర్టిస్త్ దత్తరాజ్ నాయక్‌కు (Dattaraj Naik) కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జనం కామెంట్లు పెడుతున్నారు.

Apple Watch: గుండెపోటు నుంచి రచయితను కాపాడిన యాపిల్ వాచ్.. ఎలాగంటే..

ప్రజల మనసు దోచుకోవడం ఎలానో కుక్‌కి తెలుసని కొందరు.. అక్కడి కళాఖండాలు అద్భుతంగా ఉన్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్‌లో గోడలపై ఇండియా, ఇరాన్, జర్మనీ,జపాన్ దేశాలకు చెందిన కళాకారులచే గీసిన కళాఖండాలు ఆకర్షిస్తాయి. ఇండియాలోనే మొదటి ఆర్ట్ డిస్ట్రిక్ట్ గా చెప్పబడే ఈ కాలనీని బ్రిటీష్ వారు ఏర్పాటు చేసిన చివరి కాలనీ అని కూడా చెబుతారు. మొత్తానికి యాపిల్ సీఈవోని ఈ డిస్ట్రిక్ట్ ఎంతగానో ఆకట్టుకుంది.