నడుంపై వరకూ వరద నీటిలో శరణార్థులను కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే

నడుంపై వరకూ వరద నీటిలో శరణార్థులను కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే

అస్సాంలోని ఎమ్మెల్యే మృనాల్ సైకియా నియోజకవర్గ ప్రజల కోసం తనకు మురికి అంటుతుందని అనుకోలేదు. నడుంపై వరకూ ఉన్న నీటిలో దిగి అందులో చిక్కుకున్న ప్రజలను కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 24జిల్లాల వ్యాప్తంగా 2వేల 15గ్రామాల్లో 13లక్షల కంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. ఖుంతాయ్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సైకియా చేసిన పనులుకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు ఎదుర్కొంటున్నారు.

నా నియోజకవర్గంలో వరద్ పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. లోపల ఇరుక్కుపోయిన వారిని కూడా కాపాడాలనే అనుకుంటున్నాం. గ్రామీణ ఎకానమీ కాపాడటానికి లైవ్ స్టాక్స్ చాలా ఇంపార్టెంట్. చాలా ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన గొర్రెలను కూడా కాపాడినందుకు నేను సంతోషంగా ఉన్నా. ఎమ్మెల్యే చేసిన పనికి నెటిజన్ల నుంచి భారీ ఎత్తులో ప్రశంసలు అందుతున్నాయి.

సైకియా చేసిన పని చాలా మంది రాజకీయ నాయకులకు ప్రేరణగా ఉంటుందని అన్నారు. వారు గెలిచినందుకు పని చేస్తానుకుంటున్నా. వరదల్లో మునగకుండా ఓ పసివాడ్ని తలపై ఎత్తుకుని వెళుతున్నారు ఎమ్మెల్యే. అని మరొకరు పోస్టు చేశారు.

సంక్షోభ సమయంలో సైకియా ప్రజల పక్షాన నిలిచారు. కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను ఇళ్లకు చేర్చడానికి స్వయంగా డ్రైవింగ్ చేశారు. గోలాఘాట్ జిల్లాలోని గ్రామాల్లో ఉండే వారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లడానికి తగినంత డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డారు.

ఆదివారం కురిసిన వరదలకు మట్టిపెల్లలు విరిగి.. 70మంది గాయాలపాలవగా 44మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలోని దేమాజీ, బర్పెట్టా ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర నది మట్టం పెరగడంతో వరదలు ప్రమాదకరంగా మారాయి.