లాక్‌డౌన్‌లో ఆహారం ఇవ్వటానికొచ్చి..యాచకురాలిని పెళ్లి చేసుకున్న ఆటో డ్రైవర్

  • Published By: nagamani ,Published On : May 26, 2020 / 04:55 AM IST
లాక్‌డౌన్‌లో ఆహారం ఇవ్వటానికొచ్చి..యాచకురాలిని పెళ్లి చేసుకున్న ఆటో డ్రైవర్

కష్టం వెంటే సుఖం..బాధ వెంటే సంతోషం ఉంటాయని పెద్దలు చెప్పిన మాట ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో భిక్షమెత్తుకుంటూ బతుకీడుతున్న యువతి విషయంలో నిజమైంది. తల్లి దండ్రులు చనిపోయినా అండగా ఉంటాడనుకున్న అన్న కూడా ఆమెను అనాధను చేశాడు. ఇంట్లో నుంచి గెంటేశాడు. అమ్మ అనే పిలుపు ‘అ’ నాన్న అనే పిలుపులో ‘న్న’ కలిపితే అన్న అని ఓ కవి అన్నాడు. కానీ యూపీలోని నీలమ్ అనే యువతి విషయంలో మాత్రం అది మాటకే పరిమితమైంది. కానీ కష్టాలు కలకాలం ఉండవు అనే మాటను నిజం చేస్తూ..దిక్కూ మొక్కూ లేకుండా రోడ్లపై అడ్డుక్కుని జీవించే నీలమ్ ను పెద్ద మనస్సుతో పెళ్లి చేసుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. కరోనా కష్టంలో కూడా యాచకురాలు నీలం ఎలా అదృష్టం ఎలా వరించిందో తెలుసుకుందాం..

కాన్పూర్ లో నీలంకు కొంతకాలం క్రితం తండ్రి చనిపోయాడు. తరువాత అతి కొద్ది కాలానికే తల్లికూడా చనిపోయింది. దీంతో అన్నవదినల పంచన చేరింది. కానీ కరోనా కాలంలో విధించిన లాక్ డౌన్ తో నీలం అన్నావదినలకు బరువైంది. దీంతో ఆమెను పొమ్మనలేక..ఇంట్లో ఉంచుకోవటం ఇష్టం లేక వేధించటం మొదలు పెట్టారు. అన్నా వదినలు పెట్టే కష్టాలను..సూటీ పోటీ మాటల్ని నీలం భరించలేకపోయింది. కానీ వేరే దారిలేదు. అలాగే కాలం నెట్టుకొస్తోంది. కానీ నీలంను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న అన్నావదినలు ఆమెను నిర్ధాక్షిణ్యంగా బైటకు గెంటేశారు.

దీంతో.. నీలం యాచకురాలిగా మారింది. కానీ లాక్ డౌన్ వల్ల వీధుల్లో జనాలు తిరగకపోవటంతో ఆమెకు మళ్లీ కష్టాలు నేనున్నాయంటూ వచ్చేశాయి. రోజుకు ఒక్కపూటకూడా కడుపు నింపుకోవటం కుదిరేదికాదు. 

ఈ క్రమంలో లాక్ డౌన్ కష్టాల్లో ఉండేవారికి..ముఖ్యంగా యాచకులకు కొంతమంది ఆహారం పంపిణీ చేసే క్రమంలో..అనిల్ ఓ ఆటో డ్రైవర్ ఆమెకు ఆహారం అందించటానికి వచ్చాడు. చిన్నవయస్సులోనే ఇలా అడుక్కుంటున్నావేంటీ అంటూ అడిగాడు. దీంతో నీలం తన కష్టాల కథ అంతా చెప్పుకొచ్చింది. అలా రోజు ఆమెకు ఆహారం ఇవ్వటానికి రావటం..ఇద్దరూ ఎన్నో మాటలు చెప్పుకునేవారు. అలా వారి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఓ రోజు అనిల్ నీలంను పెళ్లి చేసుకుందామా? నీకు నేనంటే ఇష్టమేనా? అని అడిగాడు. దీంతో నీలం సంతోషంగా ఒప్పుకుంది. దీంతో కాన్పూర్ లోని ఓ బుద్ధాశ్రమంలో ఆటో డ్రైవర్ అనిల్..యాచకురాలు నీలం పెళ్లి చేసుకున్నారు. 

Read: కాలుకి రింగ్, దానిపై కోడ్.. బోర్డర్ లో పావురం కలకలం, ఇది పాకిస్తాన్ కుట్రేనా