కరోనా నయం చేస్తానంటున్న టీచర్ 

10TV Telugu News

కరోనా వైరస్ వ్యాధిని నయం చేస్తానంటున్నారు ఓ టీచర్. 19వ శతాబ్దపు గజానన్ మహరాజ్ కలలో కనిపించాడని..ఆయుర్వేద ఫార్మూలా చెప్పారని గోవాకు చెందిన 55 ఏళ్ల టీచర్ మహేష్ దెగ్వేకర్ తెలిపారు. వైరస్ వ్యాప్తి నయం చేయడానికి మహరాజ్ ఫార్మూలా చెప్పారని దెగ్వేకర్ తెలిపారు. కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. 

నిమ్మరసం, అల్లం రసం, జీలకర్ర పౌడర్, వెల్లుల్లి రేకలు, గుమ్మడి లేదా పుచ్చకాయ కలగలిపిన మిశ్రమమే కరోనా వైరస్ కు విరుగుడు అన్నారు. వ్యాధి సోకిన రోగి…ఈ మందు తీసుకున్న తర్వాత…కేవలం మూడు రోజుల్లోనే ఫలితం వస్తుందని, ఆరు రోజుల్లో పూర్తి నయం అవుతుందంటున్నారు. అంతేగాకుండా…బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, బాలీవుడ్ గాయని కనికా కపూర్ లకు వ్యాధి నయం అవుతుందని గజానన్ మహరాజ్ తనకు చెప్పడం జరిగిందని వివరించారు. కేంద్ర మంత్రి నాయక్ నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందన్నారు. 

Also Read | బుధ గ్రహంపై బంగారంతో ఆక్సిజన్ తయారుచేయనున్న నాసా