No Baarat : ఇలాంటి కష్టం ఏ పెళ్లికొడుక్కి రాకూడదు… బంధువులు లేకుండానే పెళ్లి బరాత్

ప్రతి ఒ‍క్కరి జీవితంలో మరుపురాని తీపిగుర్తు పెళ్లి. అందుకే, పెళ్లిలోని ప్రతి వేడుకను వధువరులు జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉండాలనుకుంటారు. ఎంతో గ్రాండ్ గా బంధువులు, స్నేహితుల సమక్షంలో చేసుకుంటారు. ఇక వివాహం తర్వాత ఏర్పాటు చేసే బరాత్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు చేసే డ్యాన్సుల హంగామా మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు దీన్ని ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తారు. అయితే, ఓ పెళ్లి బరాత్‌లో ఇందుకు భిన్నంగా జరిగింది.

No Baarat : ఇలాంటి కష్టం ఏ పెళ్లికొడుక్కి రాకూడదు… బంధువులు లేకుండానే పెళ్లి బరాత్

Band Baaja But No Baarat

Band, Baaja But No Baarat : ప్రతి ఒ‍క్కరి జీవితంలో మరుపురాని తీపిగుర్తు పెళ్లి. అందుకే, పెళ్లిలోని ప్రతి వేడుకను వధువరులు జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉండాలనుకుంటారు. ఎంతో గ్రాండ్ గా బంధువులు, స్నేహితుల సమక్షంలో చేసుకుంటారు. ఇక వివాహం తర్వాత ఏర్పాటు చేసే
బరాత్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు చేసే డ్యాన్సుల హంగామా మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు దీన్ని ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తారు. అయితే, ఓ పెళ్లి బరాత్‌లో ఇందుకు భిన్నంగా జరిగింది. బరాత్ లో కుటుంబసభ్యులు కానీ బంధులు కానీ లేరు. కేవలం పెళ్లి కొడుకు, బ్యాండ్‌వారు మాత్రమే కనిపించారు.

ముందు బ్యాండ్ వారు ఉండగా, వెనుక గుర్రం మీద పెళ్లి కొడుకు ఉన్నాడు. పాపం పెళ్లి కొడుకు ఎంతో దీనంగా ఉన్నాడు. బ్యాండ్ వాళ్లు కూడా పెద్ద సంఖ్యలో ఏమీ లేరు. కేవలం ముగ్గరంటే ముగ్గురే ఉన్నారు. దీనికి సంబంధించిన 27 సెకన్ల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గుర్రం మీద పెళ్లి కొడుకు, ముగ్గురు బ్యాండ్ సభ్యులు.. అంతే.. ఇంకెవరూ లేరు. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉండటాన్ని వీడియోలో గమనించవచ్చు. ఇది కరోనా సునామీ ఎఫెక్ట్ అని ఇట్టే అర్థమవుతోంది. అసలే నైట్ కర్ఫ్యూ.. పైగా… ఎందుకొచ్చిన రిస్క్ అనుకున్నారో ఏమో కానీ, బరాత్‌ కు అంతా దూరంగా ఉండిపోయారు. బంధువుల మధ్య సందడిగా సాగాల్సిన పెళ్లి బరాత్‌ ఇలా వెలవెలబోయింది.

ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘పాపం.. కోవిడ్‌ మహమ్మారి వల్ల ఇలా అయింది’..అని ఒకరు జాలి చూపిస్తే.. ‘ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు బ్రో.. అని మరొకరు అడిగారు. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అని ఇంకొకరు సలహా ఇచ్చారు. ఇలాంటి కష్టం ఏ పెళ్లి కొడుక్కి రాకూడదని మరొకరు జాలి చూపించారు.

వాస్తవానికి ఏప్రిల్, మే నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో చాలామంది ముందుగానే తేదీలు ఫిక్స్ చేసుకున్నారు. కానీ, సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గణనీయంగా కేసులు పెరిగిపోయాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల లాక్ డౌన్ పెట్టగా, మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధించారు. దీంతో చాలామంది తమ వేడుకలను పెళ్లిళ్లు సహా అన్నింటిని వాయిదా వేసుకుంటున్నారు. కొందరేమో.. కొద్దిమంది బంధువుల సమక్షంలోనే కానిచ్చేస్తున్నారు. గ్రాండ్ గా చేసుకోవాలని అనుకునే వారు మాత్రం పోస్టుపోన్ చేసుకుంటున్నారు.