Bank Holidays : జూలై నెలలో 15 రోజులు బ్యాంకులు బంద్

2021, జూలై నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎత్తివేయడంతో బ్యాంకులు యదాతథంగా పనిచేస్తున్నాయి

Bank Holidays : జూలై నెలలో 15 రోజులు బ్యాంకులు బంద్

Bank

Bank Holidays : లావాదేవీలు నిర్వహించడానికి..ఇతరత్రా పనులపై బ్యాంకులకు వెళుతుంటారు. కానీ..కొన్ని రోజుల్లో బ్యాంకులు పని చేయవు. ది తెలుసుకోని వారు..బ్యాంకులకు వెళ్లి..బిక్కమొహం వేసి తిరిగి వస్తుంటారు. దీంతో ముఖ్యమైన లావాదేవీలు, డబ్బులు వేయడం, డ్రా చేసుకోలేకపోతుంటారు. ముందే బ్యాంకుల లీవ్ లు తెలుసుకోవడం ఉత్తమమని అంటుంటారు.

2021, జూలై నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎత్తివేయడంతో బ్యాంకులు యదాతథంగా పనిచేస్తున్నాయి. రాష్ట్రాల్లో ఉన్న బ్యాంకుల లీవ్ లు తెలుసుకని వెళ్లాలంటున్నారు. జులైలో బ్యాంకు సెలవుల వివరాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) అందించింది. నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులు పనిచేయవనే సంగతి తెలిసిందే. అయితే..రాష్ట్రాలను బట్టి..బ్యాంకు సెలవులు మారుతుంటాయనే సంగతి తెలిసిందే.

ఇక సెలవుల విషయానికి వస్తే…- జులై 4 – ఆదివారం
– జూలై 10 – రెండో శనివారం
– జూలై 11 – ఆదివారం
– జూలై 18 – ఆదివారం
– జూలై 24 – నాలుగో శనివారం
– జూలై 25 – ఆదివారం

– జూలై 12 – కాంగ్ (రథయాత్ర)
– జూలై 13 – భాను జయంతి
– జూలై 14 – దృక్పశేచి
– జూలై 16 – హరేల
–  జూలై 17 – యు టిరోట్ సింగ్ డే/ కర్చీ పూజ

– జూలై 19 – గురు రింపోచి తుంగ్ కార్ శేచి
– జూలై 20 – బక్రీద్
– జూలై 21 – బక్రి ఈద్ (ఈద్ ఉల్ జుహా) (ఈద్ ఉల్ అదా)
– జూలై 31 – కేర్ పూజ