UP Election 2022 : అఖిలేష్‌తో భీమ్ ఆర్మీ చీఫ్ భేటీ..పొత్తు కోసమేనా ?

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో నిలవాలని భీమ్ ఆర్మీ యోచిస్తోందని తెలుస్తోంది...

UP Election 2022 : అఖిలేష్‌తో భీమ్ ఆర్మీ చీఫ్ భేటీ..పొత్తు కోసమేనా ?

Up Akhilesh

Bhim Army Chief Met : కొద్ది రోజుల్లో యూపీలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార పీఠం కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ..వ్యూహాలు రచిస్తున్నాయి. సొంత పార్టీ వాళ్లే బీజేపీకి షాక్ ల మీద షాక్ లిస్తున్నారు. కొంతమంది నేతలు ఎస్పీలోకి వెళుతుండంతో ఆ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. పొత్తుల అవకాశాలపై చర్చలు జరుపుతోంది.

Read More : TS Covid : తెలంగాణలో ఒక్కరోజే 2 వేల 707 కేసులు..హైదరాబాద్‌‌లో ఎంతంటే

తాజాగా…భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో నిలవాలని భీమ్ ఆర్మీ యోచిస్తోందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ భేటీ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందని సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపరుచుకొనేందుకు అఖిలేష్ యాదవ్ చిన్న చిన్న పార్టీల నేతలను కలుస్తున్నారు. అయితే…దళితుల అభ్యున్నతికి బీఎస్పీ అధినేత్రి మాయావతి తగినంత కృషి చేయలేదని భీమ్ ఆర్మీ చీఫ్ వాదిస్తున్నారు. ఈయన పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్ పూర్ కు చెందిన వారు.

Read More : Mumbai Robbery : 22 ఏళ్ల క్రితం దోపీడీ..ఈనాటికి చేతికందిన బంగారం..అప్పటి విలువ రూ.13 లక్షలు ఇప్పుడు రూ.8 కోట్లు

2017లాంటి పరిస్థితులను మరలా పునరావృతం చేయడం బీజేపీకి కష్టమని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ భీమ్ ఆర్మీతో అఖిలేష్ జత కడితే…పశ్చిమ యూపీలో ఉన్న వెనుకబడిన తరగతులు, దళితుల ఓట్లు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (RLD)తో కూడా అఖిలేష్ పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు వస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన ప్రకటించింది. శరద్ పవార్ (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ) ఎన్నికల బరిలోకి దూకింది. ఎస్పీతో పొత్తుతో కొన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏఐఎంఐఎం కూడా యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. 403 స్థానాలకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 07 వరకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది.