రంజాన్ ఉపవాసంతో ఉన్నా..కరోనాతో చనిపోయిన హిందూ మృతదేహాలకు ముస్లింల అంత్యక్రియలు

రంజాన్ ఉపవాసంతో ఉన్నా..కరోనాతో చనిపోయిన హిందూ మృతదేహాలకు ముస్లింల అంత్యక్రియలు

Muslim Mens Cremate Hindu Covid Victims 

Muslim Mens Cremate Hindu COVID Victims  : ఈ కరోనా కాలం చిత్ర విచిత్రాలకు నెలవుగా మారింది. ఓ చోట మానవత్వం ప్రశార్థకంగా మారుతుంటే మరో చోట మానవత్వంతో పాటు మతసామరస్యం కూడా వెల్లివిరుస్తోంది. కరోనా కరోనా ఎక్కడ చూసినా ఇదే మాట ..మహమ్మారి వేయి జడలు విప్పి విలయతాండవం చేస్తోందా? అన్నట్లుగా ఉంది భారత్ లో ఏ మూలలో చూసినా. దీంట్లో భాగంగానే భోపాల్ లో కూడా కరోనా ప్రతాపాన్ని చూపిస్తోంది. భారీ సంఖ్యలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.

కరోనాతో మృతి చెందినవారిని వారి కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. తమకు కూడా కరోనా సోకుతుందనే భయంతో మృతుల బంధువులు మృతదేహాలకు అంత్యక్రియలు కూడా చేయటంలేదు. కానీ అటువంటి మృతదేహాలకు మేమున్నాం అంటున్నారు ముస్లిం సోదరులు. కరోనాతో చనిపోయిన హిందూ మృతదేహాలకు అన్నీ తామై అంత్యక్రియలు చేస్తున్నారు. అలా ఇప్పటివరకు..భోపాల్ నివాసితులు డానిష్ సిద్దిఖీ,సద్దాం ఖురాషిలు 60 మంది హిందూ మృతదేహాలకు దగ్గరుండి హిందూ సంప్రదాయం ప్రకారంగా దహన సంస్కారాలు జరిపారు భోపాల్ లోని ముస్లిం సోదరులు. కరోనాతో చనిపోయారనే భయంతోను..బాధతోను వారి మృతదేహాలను కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఉపవాసం ఉన్నాసరే మృతదేహాలకు దహనసంస్కారాలు చేయటం మానలేదు.

రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. ప్రతీ ముస్లిం తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో కూడా భోపాల్ లో ముస్లింలు కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు చేస్తున్నారు. దీని కోసం క్రమం తప్పకుండా ప్రతీరోజు ప్రతీ హాస్పిటల్ కు వెళతారు. చనిపోయినవారి మృతదేహాలనుతీసుకుని వెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారంగా అంత్యక్రియలు చేస్తారు. అలా ఇప్పటి వరకూ 60 హిందూ కోవిడ్ తో చనిపోయిన మతదేహాలకు దహన సంస్కారాలు జరిపారు. మృతులరి కుటుంబాలు వ్యాధి బారిన పడతాయనే భయంతో కొందరు అంత్యక్రియలను చేయలేకపోతే..మరికొందరు కుటుంబాలు కరోాన నిబంధనల కారణంగా చివరి కర్మలు చేయలేకపోయారు. కానీ ఈ ముస్లిం సోదరులు మాత్రం ఆ లోటు లేకుండా మృతులకు దహనసంస్కారాలు చేస్తున్నారు.