Aam Aadmi Party: ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ.. ఎల్జీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు తొలగించాలని కోర్టు ఆదేశం

ఆమ్ ఆద్మీ పార్టీకి, లెఫ్టినెంట్ గవర్నర్‌ (ఎల్జీ)కు మధ్య సాగుతున్న పోరులో తాజాగా ఎల్జీ పై చేయి సాధించారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

Aam Aadmi Party: ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ.. ఎల్జీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు తొలగించాలని కోర్టు ఆదేశం

Aam Aadmi Party: ఢిల్లీలో కొద్ది రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీకి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనాకు మధ్య సాగుతున్న పోరులో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో ఎల్జీకి వ్యతిరేకంగా చేసిన పోస్టులను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది.

Boyfriend For Hire: అద్దెకు బాయ్ ఫ్రెండ్… వెబ్‌సైట్ ప్రారంభం.. కానీ ఓ కండిషన్!

కొంతకాలంగా ఆప్, ఎల్జీ మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అనేక అంశాలపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆప్ చేపట్టే పలు కార్యక్రమాల్ని ఎల్జీ వ్యతిరేకిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిపై ఫిర్యాదులు చేస్తున్నారు. సీబీఐకి, కేంద్ర సంస్థలకు లేఖలు రాస్తున్నారు. దీంతో ఆప్, ఎల్జీ మధ్య పోరు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు ఎల్జీ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎల్జీ కూడా అవినీతికి పాల్పడ్డట్లు ఇటీవల ఆప్ నేతలు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా.. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రూ.1,400 కోట్ల అవినీతికి పాల్పడ్డట్లు ఆప్ ఆరోపించింది. దీనిపై ఎల్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Anti-Hijab Protests: హిజాబ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు.. ఇరాన్‌లో 75 మంది మృతి

తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 22న ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఆరోపణలకు క్షమాపణలు చెబుతూ, పరువు నష్టం కింద ఆప్ నేతలు రూ.2.5 కోట్లు చెల్లించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆప్ నేతలు తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఎల్జీకి వ్యతిరేకంగా చేసిన పోస్టులను తొలగించాలని ఆదేశించింది.