పోర్న్ సైట్లు నిషేధించండి : మోడీని కోరిన నితీష్

  • Published By: chvmurthy ,Published On : December 16, 2019 / 01:47 PM IST
పోర్న్ సైట్లు నిషేధించండి : మోడీని కోరిన నితీష్

ఇంట‌ర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్ల‌ను నిలిపివేయాల‌ని బీహార్  ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ప్ర‌ధానమంత్రి  న‌రేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ప్రధానికి ఓ లేఖ‌ రాశారు. పోర్న్ సైట్ల‌ను బ్యాన్ చేయాల‌ని, ఇంట‌ర్నెట్‌లో ఉన్న అర్థ‌ర‌హిత స‌మాచారాన్ని తొల‌గించాల‌ని నితీశ్ డిమాండ్ చేశారు. ఎక్కువ సేపు ఇలాంటి కంటెంట్‌ను చూడ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో నెగ‌టివ్ మైండ్‌సెట్ క‌లుగుతోంద‌ని,  వీటి వ‌ల్లే  సమాజంలో మ‌హిళల‌ ప‌ట్ల నేరాలు అధికం అవుతున్నాయ‌ని నితీశ్ అభిప్రాయ పడ్డారు.