CM Nitish Kumar: ఇక తగ్గేదే లే..! జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన బీహార్ సీఎం నితీశ్.. త్వరలో ఢిల్లీకి ..

జేడీ(యూ) అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. గత నెలలో ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న నితీశ్.. వేగంగా పావులుకదిపి బీహార్ రాష్ట్రంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా నితీశ్ ఎన్డీయే యేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు తన ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

CM Nitish Kumar: ఇక తగ్గేదే లే..! జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన బీహార్ సీఎం నితీశ్.. త్వరలో ఢిల్లీకి ..

Bihar CM nitheesh kumar

CM Nitish Kumar: జేడీ(యూ) అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. గత నెలలో ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న నితీశ్.. వేగంగా పావులుకదిపి బీహార్ రాష్ట్రంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా నితీశ్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీయే నుంచి విడిపోయిన తరువాత జేడీ(యు)కు వరుస షాక్ లు ఇచ్చింది బీజేపీ. తాజాగా మణిపూర్ రాష్ట్రంలోని ఆరుగురు జేడి(యు) శాసన సభ్యులలో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు. ఈ పరిణామాలను నితీశ్ కుమార్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీతో తాడాపేడో తేల్చుకోవాల్సిందేనని నితీశ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన జేడి(యు) జాతీయ కార్యవర్గ, జాతీయ మండలి సమావేశాలు శనివారం ప్రాంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం నితీశ్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

Prashant Kishor on bihar cm promises: నితీశ్ కుమార్ ఈ పనిచేస్తే నా ఉద్యమాన్ని ఆపేసి, ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా: ప్రశాంత్ కిశోర్

ప్రతిపక్షాలు ఏకమైతే 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టవచ్చునని నితీశ్ అన్నారు. బీజేపీ రాజకీయాలకు, విధానాలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకతాటికిపైకి తీసుకురావడానికి తన పనిని ప్రారంభించేందుకు సమీప భవిష్యత్తు లో తాను ఢిల్లీకి వెళ్తానని నితీశ్ చెప్పడం ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పకనే చెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే త్వరలో ఢిల్లీవెళ్లి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు సీపీఎం కు చెందిన సీతారాం ఏచూరి, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరత్ పవార్ లతో నితీశ్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Bihar CM Nitish Kumar : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజకీయ వ్యూహం..ప్రతిపక్ష పార్టీలను ఒకేతాటిపైకి!

2014 ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించినందుకు 2013లో నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి తప్పుకున్నాడు. అయితే తిరిగి 2017 సంవత్సరంలో మోదీ నేతృత్వంలోని బీజేపీతో జట్టుకట్టారు. అయితే ప్రస్తుతం నితీశ్.. బీజేపీని అధికార పీఠం నుంచి దింపేలా తన శాయశక్తులా కృషిచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలోలా కాకుండా ఈసారి నితీశ్ తన ఆశయంపై స్పష్టంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల మాట. ఎన్డీయేతర పక్షాల నేతలను కలిసేందుకు ఆయన ఢిల్లీ టూర్ ప్రారంభించనున్న నేపథ్యంలో నితీశ్ ఎలా ముందకెళ్తాడు, బీజేపీని గద్దెదింపేందుకు ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారనేది రాబోయే రోజుల్లో తేలనుంది.