వీడియో : గంగానదిలో కూలిపోయిన స్కూల్

  • Published By: veegamteam ,Published On : September 17, 2019 / 03:46 AM IST
వీడియో : గంగానదిలో కూలిపోయిన స్కూల్

బీహార్‌లోని కతిహార్‌లోని గంగా నదిలో ఒక స్కూల్ భవనం సోమవారం (సెప్టెంబర్ 16)న నిట్టనిలువునా కూలిపోయింది. నీటి ధాటికి మెల్ల మెల్లగా కూలిపోతున్న స్కూల్ ను పలువురు ఆసక్తిగా సెల్ ఫోన్ లతో షూట్ చేశారు. నీటితో నానిపోయిన  స్కూల్ భవనం పునాదులు కొంచెం కొంచెంగా నీటిలో పడిపోయాయి. ఆ తరువాత భవనం కూడా కూలిపోయింది.

ఆ చుట్టూ ఉన్న నీటి దిబ్బలు కూడా నీటి ధాటికి కరిగిపోయి గంగానదిలో కలిసిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా వరదలు కారణంగా స్కూల్ భవనానికి ప్రమాదం పొంచి ఉందనే సమాచారంతో అధికారులు ముందుగానే క్లాసులను నిలిపివేసి విద్యార్థులను వేరే స్కూల్ కు తరలించారు. దీంతో భవనం కూలిపోయినా ఎటువంటి ప్రాణనష్టం కలగలేదు. 

నీటి సమస్యలతో కటకటలాడిపోతూ..వర్షాల కావాలని ప్రార్థించిన ప్రజలు ఇప్పుడు వర్షాలు కురవకుండా ఉంటే బాగుండు భగవంతుడా అనుకుంటున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. వరదలతో పలు రాష్ట్రాలు నానా అవస్థలు పడుతున్నాయి. వరదలకు పలు భవనాలు కూలిపోయిన విషయం తెలిసిందే. వరద కష్టాల  నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.