Corbevax : మేడిన్ ఇండియా.. పిల్లలకు అందుబాటులోకి మరో వ్యాక్సిన్

భారత్ లో పిల్లలకు దేశీయంగా తయారైన మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 12-18ఏళ్ల వారి కోసం బయోలాజికల్‌-ఇ తయారు చేసిన కోర్బెవ్యాక్స్‌ కు డీసీజీఐ పరిమితులతో కూడిన అత్యవసర..

Corbevax : మేడిన్ ఇండియా.. పిల్లలకు అందుబాటులోకి మరో వ్యాక్సిన్

Corbevax

Corbevax : భారత్ లో పిల్లలకు దేశీయంగా తయారైన మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 12-18ఏళ్ల వారి కోసం హైదరాబాద్ కు చెందిన ఫార్మా పరిశోధన సంస్థ బయోలాజికల్‌-ఇ తయారు చేసిన కోర్బెవ్యాక్స్‌ కు డీసీజీఐ పరిమితులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. దేశంలో ఇప్పటికే 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ ఇస్తున్నారు.

కొవాగ్జిన్ తరహాలోనే కోర్బెవ్యాక్స్ ను రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి ఉంటుంది. పిల్లల కోసం దేశంలో ‘కోర్బెవాక్స్’ రూపంలో రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టు అయ్యింది. దేశంలో అన్ని వయసుల వారికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే బాలలకు, కుర్రకారుకు అందించేందుకు మరో వ్యాక్సిన్ కు పచ్చజెండా ఊపింది.

Corona Vaccination: దేశంలో 80శాతం మంది వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి

పెద్దలకు టీకా వేసే విషయంలో దేశీయంగా తయారైన ఈ కొవిడ్‌ వ్యాక్సిన్‌కు గతేడాది డిసెంబర్‌ 28నే అత్యవసర వినియోగ అనుమతులు లభించినప్పటికీ.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మాత్రం భాగం కాలేదు.

India Covid : భారత్‌‌‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

5-18 వయసు చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి రెండో, మూడో దశ ట్రయల్స్‌ నిర్వహించేందుకు గతేడాది సెప్టెంబర్‌లో బయోలాజికల్‌-ఇ సంస్థకు అనుమతి లభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న రెండో, మూడో దశ ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాల ఆధారంగా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినట్లు బయోలాజికల్‌-ఇ సంస్థ తెలిపింది. భారత్ లో పిల్లల కోసం అందుబాటులోకి వచ్చిన రెండో వ్యాక్సిన్ ఇదే.

కోర్బెవ్యాక్స్ టీకా 0.5ఎంఎల్(సింగిల్ డోస్), 5ఎంఎల్(10 డోసులు), 10ఎంఎల్(20 డోసులు) వయల్ ప్యాక్స్ లో వస్తుంది. బయోలాజికల్-ఇ.. హైదరాబాద్ బేస్డ్ ఫర్మ్. 1953లో నెలకొల్పారు. దేశంలో తొలి ప్రైవేట్ సెక్టార్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కంపెనీ ఇదే. అంతేకాదు దక్షిణ భారత దేశంలో తొలి ఫార్మాకూటికల్ కంపెనీ కూడా ఇదే.