బీజేపీకి మరో షాక్: ఆస్పత్రిలో చేరిన మురళీ మనోహర్ జోషీ

  • Edited By: vamsi , August 26, 2019 / 02:33 AM IST
బీజేపీకి మరో షాక్: ఆస్పత్రిలో చేరిన మురళీ మనోహర్ జోషీ

భారతీయ జనతా పార్టీకి వరుసగా షాక్ ల మీద షాకులు తగులుతున్న క్రమంలోనే మరో షాక్ తగిలింది. సుష్మా స్వరాజ్ ను కోల్పోయిన బాధ నుంచి ఆ పార్టీ కోలుకోకముందే ఆ పార్టీకి చెందిన అరుణ్ జైట్లీ శనివారం(24 ఆగస్ట్ 2019) చనిపోవడంతో పార్టీ శోకసంద్రంలో మునిగిపోయింది.

ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన మరో ముఖ్య నేత మురళీ మనోహర్ జోషీ ఆసుపత్రిపాలు కావడంతో ఆ పార్టీ నేతలు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖమాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిసిన తర్వాత బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. తన నివాసంలో ఉండగా మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆయనకు కాన్పూర్‌లోని రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వయస్సు కారణాల రిత్యా ఆయన ఇటీవలి లోక్ సభ ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో మురళీ మనోహర్ జోషి ఒకరు. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.