ఈసారి పక్కాగా దిగుదాం : చంద్రయాన్ 2పై ఏడ్చేసిన బీజేపీ మినిస్టర్

ఈసారి పక్కాగా దిగుదాం : చంద్రయాన్ 2పై ఏడ్చేసిన బీజేపీ మినిస్టర్

గెలుపోటములు సహజం.. మార్చి కాకపోతే సెప్టెంబర్ అని పిల్లలకు ధైర్యం చెబుతాం.. అలాంటిది ఇప్పుడు దేశం మొత్తం ఉద్విగ్నభరితమైన వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశానికి సాధ్యం కాని.. చంద్రుడి దక్షిణ వైపు పరిశోధనలకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం.. చివరి క్షణాల్లో ఫెయిల్ అయ్యింది. చంద్రుడికి కేవలం 2 అంటే రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా కమ్యూనికేషన్ కట్ అయ్యింది. 

ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ ఏర్పడింది. స్వయంగా ప్రధాని మోడీ బెంగళూరు ఇస్రోకి రావటం.. వీక్షించటం ద్వారా 130 కోట్ల మంది ప్రజల్లోనే కాకుండా ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసింది. చివరి క్షణాల్లో కమ్యూనికేషన్ కట్ కావటంతో.. ఇస్రో చైర్మన్ సైతం కంటతడి పెట్టారు. అయినా దేశం మొత్తం ఇస్రోకి సలాం కొడుతోంది. ఈ బాధను తట్టుకోలేక మీడియా ముందు కంట తడి పెట్టారు బీజేపీ మంత్రి.

ఉత్తరప్రదేశ్ కు చెందిన మినిస్టర్ మోసిన్ రాజా.. తన ఛానల్ తో మాట్లాడుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కొన్ని క్షణాల్లో విజయం వరిస్తుంది అనుకుంటున్న టైంలో ఇలా జరగటం బాధగా ఉందన్నాడు. అంతదూరం వెళ్లి.. 2 అంటే రెండు కిలోమీటర్ల దూరంలో ఆగిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని.. రాత్రంతా నిద్ర పట్టటం లేదన్నాడు మంత్రి మోసిన్ రాజా. 

ఇస్రోకు దేశం మొత్తం అండగా ఉందని.. ధైర్యం కోల్పోవద్దన్నారు. ఇప్పటికే ఎన్నో ఎన్నో ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకి.. చంద్రుడిని జయించటం అసాధ్యం కాదన్నారు మంత్రి.