Karnataka elections 2023: సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలి: ఈసీకి బీజేపీ ఫిర్యాదు

Karnataka elections 2023: కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) నేతృత్వంలోని బీజేపీ బృందం ఈసీకి ఈ మేరకు విజ్ఞాపన పత్రం సమర్పించింది.

Karnataka elections 2023: సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలి: ఈసీకి బీజేపీ ఫిర్యాదు

Sonia Gandhi

Karnataka elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘాని( Election Commission)కి బీజేపీ (BJP) సోమవారం ఫిర్యాదు చేసింది. “కర్ణాటక సార్వభౌమాధికారం” అంటూ సోనియా వ్యాఖ్యలు చేశారని పేర్కొంది.

ఆమెపై చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) నేతృత్వంలోని బీజేపీ బృందం ఈసీకి ఈ మేరకు విజ్ఞాపన పత్రం సమర్పించింది.

“సార్వభౌమత్వం అనే పదాన్ని సోనియా గాంధీ ఉద్దేశపూర్వకంగా వాడారు. తుక్డే-తుక్డే గ్యాంగ్ అజెండానే కాంగ్రెస్ మేనిఫెస్టో. అందుకే ఇటువంటి పదాలను వాడుతున్నారు. ఈ దేశ వ్యతిరేక చర్య పట్ల ఈసీ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం” అని భూపేంద్ర యాదవ్ మీడియాకు తెలిపారు.

సార్వభౌమత్వం అనే పదాన్ని దేశం కోసం వాడతామని, ఇదే పదాన్ని సోనియా గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ వాడారని కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే చెప్పారు. అందుకే తాము సోనియా గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.

కాగా, నిన్న కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ కూడా సోనియా చేసిన “కర్ణాటక సార్వభౌమాధికారం” వ్యాఖ్యను ప్రస్తావించారు. దేశానికి స్వాతంత్ర్యం వస్తే సార్వభౌమాధికార దేశం అంటారని మోదీ చెప్పారు. దేశంలో కర్ణాటక భాగం కాదన్నట్లు కాంగ్రెస్ మాట్లాడుతోందని విమర్శించారు.

Karnataka elections 2023 : నిన్న స్కూటీపై ఈ రోజు సిటీ బస్సులో రాహుల్ గాంధీ వినూత్న ప్రచారం