Bihar: ప్రారంభానికి ముందే కూలిపోయిన బ్రిడ్జి.. రూ.13 కోట్లు వృథా

బిహార్‌లో ఒక బ్రిడ్జి ప్రారంభం కూడా కాకుండానే కూలిపోయింది. 206 మీటర్ల పొడవు కలిగిన ఈ బ్రిడ్జి కోసం రూ.13 కోట్లు వెచ్చించారు. 2017లోనూ పూర్తైంది ఈ బ్రిడ్జి. వివిధ కారణలతో ఇంతకాలం ప్రారంభం కాలేదు.

Bihar: ప్రారంభానికి ముందే కూలిపోయిన బ్రిడ్జి.. రూ.13 కోట్లు వృథా

Bihar: ప్రారంభానికి ముందే బ్రిడ్జి కూలిపోయిన ఘటన బిహార్‌లో జరిగింది. బిహార్‌లోని బెగుసరై ప్రాంతంలో ఉన్న గందక్ నదిపై ప్రభుత్వం ఒక బ్రిడ్జి నిర్మించింది. ముఖ్యమంత్రికి చెందిన నాబార్డ్ పథకం కింద ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.13 కోట్లు మంజూరు చేశారు. దీంతో 206 మీటర్ల నిర్మాణం కలిగిన ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది.

Maharashtra: బాలికపై పన్నెండు గంటలపాటు సామూహిక అత్యాచారం.. 8 మంది నిందితులు అరెస్ట్

ఆకృతి టోలా చౌకి నుంచి బిషన్‌పూర్ వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. దీని నిర్మాణం 2016లో ప్రారంభమై, 2017లో పూర్తైంది. నిర్మాణం పూర్తై ఐదేళ్లైనా వివిధ కారణాలతో ఇప్పటికీ బ్రిడ్జి ప్రారంభం కాలేదు. బ్రిడ్జి ప్రాంతానికి చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం కూడా బ్రిడ్జి అధికారికంగా ప్రారంభం కాకపోవడానికి మరో కారణం. కాగా, ఇటీవల బ్రిడ్జిపై పగుళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారులకు ఈ విషయై రెండు రోజుల క్రితమే సంబంధిత అధికారులు లేఖ రాశారు. దీనిపై తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతుండగానే బ్రిడ్జి కూలిపోయింది. ఆదివారం ఉదయం బ్రిడ్జి ముందువైపు మధ్యలో కూలిపోయింది.

ప్రారంభం కూడా కాకుండానే బ్రిడ్జి కూలిపోయిందంటే దీని నిర్మాణం ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో బ్రిడ్జి నిర్మాణానికి కేటాయించిన రూ.13 కోట్లు వృథా అయ్యాయని స్థానికులు, ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు.