CAA Protest : మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై FIR

  • Published By: madhu ,Published On : December 18, 2019 / 04:28 AM IST
CAA Protest : మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై FIR

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. జామియా మిలియా యూనివర్సిటీలో చెలరేగిన ఆందోళనలు దేశంలో ఉన్న వివిధ వర్సిటీలకు పాకాయి. వేలాదిగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. నియంత్రించేందుకు పోలీసులు జరిపిన లాఠీఛార్జీ, టియర్ గ్యాస్‌లో విద్యార్థులు గాయపడ్డారు.

జామియా మిలియా ఇస్లామియా, చుట్టు పక్కల ప్రాంతాల్లో 2019, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం జరిగిన హింసాత్మక ప్రదర్శనలకు సంబంధించి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్‌పై ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. సీలంపూర్ టీ పాయింట్ దగ్గర ఓ గంట పాటు ప్రదర్శనలు జరిగాయని, ఆందోళనకారుల్లోంచి..కొందరు రాళ్లు విసరడం ప్రారంభించారని ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ ఆలోక్ కుమార్ వెల్లడించారు. సీలంపూర్ ఘటనలో 21 మందికి గాయాలయ్యాయని, 12 మంది ఢిల్లీ పోలీసులు, ముగ్గురు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో దేశరాజధాని అట్టుడుకుతోంది. ఆందోళన కారులు ఆస్తులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. వాహనాలకు నిప్పుపెట్టి బీభత్సం సృష్టిస్తున్నారు. లాఠీచార్జ్, టియర్ గ్యాస్‌ ప్రయోగించినా ఆందోళనలు అదుపులోకి రావడం లేదు. ఆందోళన కారుల ముసుగులో అల్లరిమూకలు చొరబడి విధ్వంసం సృష్టించడంతో.. పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితిపై కేంద్రంహోంశాఖ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఢిల్లీ..మంగళవారం ఈస్ట్ ఢిల్లీ ప్రాంతంలో ఆందోళనలు జరగడంతో కేంద్రం అప్రమత్తమైన ఢిల్లీ కేపిటల్ ఏరియా అంతటా హై అలర్ట్ ప్రకటించింది

* శాంతియుతంగా ఉండాలని సీఎం కేజ్రీవాల్ పిలుపు. 
* మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ రాష్ట్రపతికి ఫిర్యాదు. 
* ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును అణిచివేయవద్దని వెల్లడించిన సోనియా. 
* విపక్షాలు ఎంతైనా వ్యతిరేకించినా..వెనక్కి తగ్గమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా. 
* వ్యతిరేక ప్రదర్శనలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్న ప్రధాన మంత్రి మోడీ. 
Read More : కలకలం : నాగ్ పూర్ మేయర్‌పై కాల్పులు