Supreme Court:యుక్రెయిన్ పరిస్థితులు బాధాకరం..కానీ యుద్ధం ఆపేయమని పుతిన్‌ను ఆదేశించ‌గ‌ల‌మా? : ఎన్వీ రమణ

యుక్రెయిన్ పరిస్థితులు బాధాకరం..కానీ యుద్ధాన్ని ఆపాల‌ని పుతిన్‌ను ఆదేశించ‌గ‌ల‌మా? అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు.

Supreme Court:యుక్రెయిన్ పరిస్థితులు బాధాకరం..కానీ యుద్ధం ఆపేయమని పుతిన్‌ను ఆదేశించ‌గ‌ల‌మా? : ఎన్వీ రమణ

Can We Ask Putin To Stop The War, Asks Cji Ramana

Can we ask Putin to stop the war, asks CJI Ramana: యుక్రెయిన్ లో పరిస్థితులు చాలా బాధ కలిగిస్తున్నాయని..యుక్రెయిన్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు తీవ్రంగా క‌లిచివేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆవేదన వ్య‌క్తం చేశారు. ‘ఈ విషయంలో మేమేం చేయగలం, యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాల‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ను ఆదేశించ‌గ‌ల‌మా? అని ఆయన నిర్వేదంగా ప్రశ్నించారు. ఓ కేసు విచార‌ణ స‌మ‌యంలో ఇవాళ ఆయ‌న సుప్రీంకోర్టులో ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

యుక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల త‌ర‌లింపు విష‌యంలో యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఓ విద్యార్ధి కుటుంబం గురువారం (మార్చి 3,2022) సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. మోల్డోవా-రొమేనియా సరిహద్దులో భారత ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందించకుండా విద్యార్థులు చిక్కుకుపోయారని పేర్కొంటూ..మీరేమన్నా చేయండీ మా బిడ్డలను మా వద్దకు చేర్చేలా చేయండి అని కోరుతూ కోర్టులో కేసు వేశారు.ఆ కేసును సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. యుక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయుల్ని త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వీలైనంత చేస్తోందని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంలో సీజేఐ త‌న అభిప్రాయాల్ని వ్య‌క్తం చేశారు.

Also read : Roman Abramovich : పుతిన్‌తో సంబంధాలు.. రష్యన్‌ బిలియనీర్‌‌కు చిక్కులు…!

యుక్రెయిన్ లో చిక్కుకున్న భార‌తీయ విద్యార్థుల ప‌ట్ల సానుభూతి ప్ర‌క‌టిస్తున్న‌ాని సీజే తెలిపారు. యుక్రెయిన్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు తీవ్రంగా క‌లిచివేస్తున్న‌ాయ‌ని..సోష‌ల్ మీడియాలో ఓ వీడియో చూశాన‌ని..ఆ వీడియోలో సీజేఐ ఏం చేస్తున్నార‌ని ఒక‌రు ప్రశ్నించారని దానికి సీజేఐ ‘యుద్ధాన్ని ఆపాల‌ని నేను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆదేశించ‌గ‌ల‌నా? అని ఆయ‌న ప్రశ్నించారు.

24 ఏళ్ల ఫాతిమా అహానా అనే మహిళా వైద్య విద్యార్థిని కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌లో ఒడెస్సా విశ్వవిద్యాలయం నుండి దాదాపు 250 మంది భారతీయ విద్యార్థులు మోల్డోవా-రొమేనియా సరిహద్దుకు చేరుకున్నారని పిటీషన్ లో పేర్కొంది. ఈ విద్యార్థులు రొమేనియాకు వెళ్లడానికి అనుమతి లేకుండా ఆరు రోజులుగా అక్కడ చిక్కుకుపోయారని పిటిషన్‌లో పేర్కొంది. ఎయిరిండియా తరలింపు విమానంలో ఎక్కేందుకు ఉక్రెయిన్ నుండి రొమేనియాకు వెళ్లే మార్గంలో మోల్డోవాలోని చెక్ పాయింట్‌ను దాటడానికి పిటిషనర్‌కు సురక్షితమైన అనుమతి కోసం కోర్టు జోక్యాన్ని కోరారు. విద్యార్థులను ఉక్రెయిన్ సరిహద్దును దాటి మోల్డోవాలోకి ప్రవేశించడానికి అనుమతించడం లేదని పిటిషన్‌లో పేర్కొంది. ఈ విషయంలో భారత అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదు” అని పేర్కొంది.

Also read : Russia-ukraine war : దేశం కోసం యుక్రెయిన్ సైన్యంలో చేరుతున్న అథ్లెట్లు..గన్ పట్టి రంగంలోకి దిగిన షూటింగ్

కాగా..ఇప్ప‌టికే వేల మంది భార‌తీయ విద్యార్థుల్ని ఆప‌రేష‌న్ గంగాలో భాగంగా ఇండియాకు తీసుకువ‌చ్చారు. మార్చి 3న మ‌రో 8 విమానాల్లో సుమారు 3726 మందిని ఇండియాకు తీసుకురానున్న‌ట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తెలిపారు. బుచారెస్ట్ నుంచి 8, సుసేవా నుంచి రెండు, కోసి నుంచి ఒక‌టి, బుదాపెస్ట్ నుంచి 5, రెజ‌స్వో నుంచి మూడు విమానాల‌ను బ‌య‌లుదేర‌నున్న‌ట్లు మంత్రి సింథియా చెప్పారు.