Chikoti Praveen : అదంతా ఫేక్.. త్వరలోనే నిజాలు బయటపెడతా-చీకోటి ప్రవీణ్

తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ చీకోటి ప్రవీణ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ ఖాతాల పేరుతో పోస్టులు చేస్తున్న వారిపై సీసీఎస్ లో(సెంట్రల్ క్రైమ్ స్టేషన్) ఫిర్యాదు చేశారు చీకోటి ప్రవీణ్.

Chikoti Praveen : అదంతా ఫేక్.. త్వరలోనే నిజాలు బయటపెడతా-చీకోటి ప్రవీణ్

Chikoti Praveen : క్యాసినో డాన్ చీకోటి ప్రవీణ్ రెండో రోజు ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరయ్యారు. తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ చీకోటి ప్రవీణ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చీకోటి ప్రవీణ్ ఆరోపించారు. నకిలీ ఖాతాల పేరుతో పోస్టులు చేస్తున్న వారిపై సీసీఎస్ లో(సెంట్రల్ క్రైమ్ స్టేషన్) ఫిర్యాదు చేసినట్లు చీకోటి చెప్పారు. మాధవరెడ్డి హాజరుపై తనకు సమాచారం లేదన్నారు చీకోటి ప్రవీణ్. అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

చీకోటి ప్రవీణ్.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. క్యాసినో కాట్రాజ్ గా చీకోటి ప్రవీణ్ గుర్తింపు పొందాడు. దేశ విదేశాల్లో క్యాసినో నిర్వహించడంలో చీకోటి దిట్ట. ఈ క్రమంలో క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి చీకోటి ప్రవీణ్‌ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ముమ్మరంగా విచారణ చేస్తోంది.

Casinor Chikoti Praveen : గల్లీ నుంచి మొదలైన..క్యాసినో గాంబ్లర్ చికోటి ప్రవీణ్‌ ప్రస్థానం

ఈ క్రమంలోనే చికోటి ప్రవీణ్ ట్వీట్స్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు చీకోటి ప్రవీణ్‌ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్‌ చేసినట్లు తెలిసింది. @praveenchikotii పేరుతో ట్విట్టర్‌లో నకిలీ ఖాతాను గుర్తించారు చీకోటి ప్రవీణ్‌. వాటి ద్వారా ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలను ప్రవీణ్ బెదిరిస్తున్నట్టు.. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సైతం ఆయా ట్వీట్లలో ప్రస్తావిస్తు ఫేక్ పోస్ట్‌లు పెట్టినట్లు సమాచారం.

Casino Chikoti Praveen : చికోటి ప్రవీణ్‌..అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌..ఇది పేరే కాదు ఇట్స్ ఏ బ్రాండ్

సోషల్ మీడియాల్లో ఫేక్ అకౌంట్లపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు చీకోటి ప్రవీణ్‌. ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆయా నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని.. సీసీఎస్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చీకోటి ప్రవీణ్ ఆరోపించారు.

కాగా.. క్యాసినో కేసులో తొలి రోజు (ఆగస్టు 1) 10 గంటల పాటు ఈడీ విచారణ కొనసాగింది. చీకోటి ప్రవీణ్, అతడి అనుచరులపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈడీ విచారణకు చీకోటి ప్రవీణ్ తో పాటు నలుగురు ఏజెంట్లు మాధవ రెడ్డి, గౌరీ శంకర్, అగర్వాల్, సంపత్ లు హాజరయ్యారు. అందరినీ కలిపి ఈడీ విచారించింది. విదేశాల్లో నిర్వహించిన 50 గ్యాంబ్లింగ్, ఈవెంట్స్ లావాదేవీలపైన ఈడీ ఆరా తీసింది.

ఈవెంట్ నిర్వహణలో ఒక్కో ఏజెంట్ కి ఒక్కో పని అప్పచెప్పారు చీకోటి ప్రవీణ్. ఫ్లైట్ టికెట్ బుక్సింగ్స్ సంపత్ చూసుకున్నాడు. హోటల్ బుకింగ్స్, గేమ్ నిర్వహణ, కస్టమర్స్ ఎంటర్ టైన్ మెంట్ మిగతా ఏజెంట్లు చూసుకున్నారు. ఇటు ఫెమా యాక్ట్, మనీ లాండరింగ్ అంశాలపై లోతుగా విచారించారు అధికారులు. హవాలా ద్వారా డబ్బు తరలింపుపైనా ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ బృందాన్ని అధికారులు విచారించారు. క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి చీకోటి ప్రవీణ్‌ను ఈడీ విచారణ చేస్తోంది.

ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. సోమవారం ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న చీకోటి.. తన వెంట బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, నోటీస్‌ కాపీతో పాటు న్యాయవాదిని తీసుకొచ్చారు. క్యాసినో అంశంలో జరిగిన లావాదేవీలపై ప్రవీణ్‌తో పాటు బోయిన్‌పల్లికి చెందిన మాధవరెడ్డి, ట్రావెల్‌ ఏజెంట్‌ సంపత్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. విదేశాల్లో జరిగిన క్యాసినో దందాలో జరిగిన హవాలా లావాదేవీలపై ఆరా తీసిన్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు అడిగిన బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను ప్రవీణ్‌ వారికి అందజేసినట్లు సమాచారం.

నేపాల్‌, శ్రీలంక, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌.. తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను ప్రవీణ్‌ బృందం తరలించినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఒక్కో విడత మూడు నాలుగు రోజులపాటు జరిగే క్యాంపుల్లో పాల్గొనేందుకు పంటర్లు రూ.3-5లక్షల చొప్పున వారికి చెల్లించినట్లు గుర్తించింది. క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిచిందనేది ఈ కేసులో ఈడీ ప్రధాన అభియోగం.

అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్‌ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకుని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ అంశాలను ప్రస్తావిస్తూ చీకోటి ప్రవీణ్‌ బృందాన్ని ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

చీకోటి ప్రవీణ్‌ హవాలా లావాదేవీలపై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. చీకోటి వాట్సాప్‌ కీలక సమాచారాన్ని ఈడీ సేకరించింది. చీకోటి ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ను అధికారులు సీజ్‌ చేశారు. పెద్ద మొత్తంలో హవాలా జరిగినట్లు ఈడీ గుర్తించింది. సినీ, రాజకీయ నేతలకు చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. 10 మంది సినీ ప్రముఖులతో పాటు 20 మంది రాజకీయ నేతలు, 200 మంది కస్టమర్స్‌ లిస్ట్‌ ముందుంచి ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ఫ్లైట్‌, హోటల్స్‌ బుకింగ్‌పైనా ఈడీ కీలక సమాచారం సేకరించింది.