Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ నుంచి కూడా సీబీఐ వివరాలు రాబట్టాలని నిర్ణయిచింది.

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు

Arvind Kejriwal

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. రెండు గంటలుగా విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన-అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆప్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ నుంచి కూడా సీబీఐ వివరాలు రాబట్టాలని నిర్ణయిచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆదివారం ఏప్రిల్16న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కేజ్రీవాల్ సీబీఐ ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం సీబీఐ ముందు కేజ్రీవాల్ హాజరయ్యారు.  కాగా, దర్యాప్తు సంస్థలపై కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. దర్యాప్తు సంస్థల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ముందు ఈడీ, సీబీఐలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు.

Arvind Kejriwal: బీజేపీ సీబీఐని ఆదేశిస్తే అలాకూడా జరగొచ్చు.. సీబీఐ విచారణ హాజరుకు ముందు కేజ్రీవాల్ వీడియో సందేశం

ఈడీ విచారణలో కొందరి పేర్లు చెప్పాలని చందన్ రెడ్డిని టార్చర్ చేశారని ఆరోపించారు.  ఇప్పటివరకు లిక్కర్ కేసులో అరెస్టయిన వాళ్ళను దర్యాప్తు సంస్థలు టార్చర్ పెట్టి, వేధిస్తున్నాయని వెల్లడించారు. 100 కోట్ల రూపాయలు అంటారు.. ఒక్క పైసా దొరకలేదన్నారు. ఆదివారం సీబీఐ ముందు మోడీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తే నమ్ముతారా? విచారణ చేస్తారా? అని ప్రశ్నించారు. కొత్త పాలసీ వల్ల 50 శాతం ఆదాయం పెరిగిందన్నారు. లిక్కర్ స్కాం అనేదే లేదని స్పష్టం చేశారు. కావాలని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోని ఒక్కొక్కరిని కేసుల్లో ఇరికిస్తున్నారని వెల్లడించారు.

ఢిల్లీలో అసలు లిక్కర్ స్కామ్ అనేదే జరగలేదని కేజ్రీవాల్ అంటున్నారు. భారత్ లో కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని.. దేశం అభివృద్ధి చెందకుండా చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో పేదలు, దళితులకు నాణ్యమైన విద్య అందకూడదని భావిస్తున్నాయని తెలిపారు. ఆ శక్తులే మనీశ్ సిసోడియాను జైలుకు పంపాయని పేర్కొన్నారు. ఆయనను జైలుకు పంపిన వారు దేశానికి శత్రవులు అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరుగలేదని.. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా పలు చర్యలకు పాల్పడుతోందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.

Delhi liquor scam: కేజ్రీవాల్‌కు నోటీసులు అందడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

సీబీఐ, ఈడీని వాడుకుంటూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని విమర్శలు చేశారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ పలువురు ప్రముఖులను అరెస్టు చేసింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఇటీవలే ఈడీ ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగిన విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి.