Vaccine Open Market : బహిరంగ మార్కెట్‌లోనూ కరోనా వ్యాక్సిన్‌ విక్రయాలు

భారత్‌లో అంతకంతకు పెరిగిపోతున్న కేసులను చూస్తుంటే.. పరిస్థితి చేయిజారిపోయినట్టే కనిపిస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కిరిక వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Vaccine Open Market : బహిరంగ మార్కెట్‌లోనూ కరోనా వ్యాక్సిన్‌ విక్రయాలు

Chance To Sell The Corona Vaccine In The Open Market

corona vaccine in the open market : భారత్‌లో అంతకంతకు పెరిగిపోతున్న కేసులను చూస్తుంటే.. పరిస్థితి చేయిజారిపోయినట్టే కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు కరోనా కట్టడికి ఏకైక మార్గం… వ్యాక్సినేషన్‌ ఒక్కటే అని భావిస్తున్న కేంద్రం.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కిరిక వ్యాక్సిన్‌ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది.. కేంద్రం నిర్ణయంతో మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి అంటే.. దాదాపు 91.1 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైంది…. ఇందులో 20 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారి సంఖ్యే 37 కోట్ల 37 లక్షల 72 వేల 951గా ఉంది.. 18 నుంచి 20 ఏళ్ల వారిని కూడా కలుపుకుంటే.. ఆ సంఖ్య 40 కోట్లకు పైగా చేరుకుంటుంది.. అంటే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అదనంగా 40 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నారు. ఇప్పటికే 12 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తికాగా.. ఇంకా 79.1 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంది.. ప్రస్తుత గణాంకాలను చూసుకుంటే.. ఇంకా 158 కోట్ల డోస్‌లను తయారు చేయాల్సి ఉంది..

బహిరంగ మార్కెట్‌లోనూ వ్యాక్సిన్‌ విక్రయాలకు ఛాన్స్‌ ఇవ్వనున్నారు. బహిరంగ మార్కెట్‌లో వ్యాక్సిన్ ధరలపై మే1లోగా నిర్ణయం తీసుకోనున్నారు. 50 శాతం టీకాలు అమ్ముకునేందుకు ఉత్పత్తి సంస్థలకు అనుమతి ఇచ్చారు. 50 శాతం టీకాలు రాష్ట్రాలకు, మార్కెట్‌లో విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు. ఉత్పత్తి సంస్థలు టీకాలను మార్కెట్లో నిర్దేశిత ధరకు అమ్ముకునే అవకాశం కల్పించారు. ఉత్పత్తి సంస్థల నుంచి వ్యాక్సిన్లను నేరుగా కొనేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చారు. 45 ఏళ్లు నిండినవారికి యథావిధిగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ఉంటుంది. రెండో డోసు తీసుకునేవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ వృథా చేసే రాష్ట్రాలకు పంపిణీ చేసే వ్యాక్సిన్ కోటాలో కోత విధించారు.

ఇక తెలంగాణలో ఈ ఏడాది జనవరి 1నాటికి 18 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 2.62 కోట్లుగా ఉంది.. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉన్నా.. వ్యాక్సిన్‌ కొరత కారణంగా రోజుకు 1.50 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తున్నారు.. ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణలో వ్యాక్సినేషన్‌ పూర్తవ్వడానికి ఏడాది సమయం పడుతోందని అంచనా వేస్తున్నారు.. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ డోస్‌లు అందుబాటులో ఉంటే కేవలం నెల రోజుల్లో వ్యాక్సిన్‌ వేయవచ్చంటున్నారు. మరి ఇప్పటికిప్పుడు ఇండియాలో 18 ఏళ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్‌ సాధ్యమేనా? వీరందరికి వ్యాక్సినేషన్‌ ఇవ్వడానికి ఎంత కాలం పడుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.