GST : నేటి నుంచి జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులు అమల్లోకి..సామాన్యులపై పెరుగనున్న భారాలు

జున్ను, పాలు, మజ్జిగ, ఆటా, గోధుమలు, చెంచాలపై ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు జీఎస్టీ వర్తించని పాలు, మజ్జిగ, వెన్న, జున్ను, ఆట వంటి నిత్యావాసరాలపై జీఎస్టీ మోత మొదలు కానుంది. పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు.

GST : నేటి నుంచి జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులు అమల్లోకి..సామాన్యులపై పెరుగనున్న భారాలు

Gst

GST slabs : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబుల్లో పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే.  జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో సామాన్య ప్రజలపై భారాలు పెరుగనున్నాయి. జున్ను, పాలు, మజ్జిగ, ఆటా, గోధుమలు, చెంచాలపై ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు జీఎస్టీ వర్తించని పాలు, మజ్జిగ, వెన్న, జున్ను, ఆట వంటి నిత్యావాసరాలపై జీఎస్టీ మోత మొదలు కానుంది.

పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు. ఆటా, పప్పులు, బియ్యం, బెల్లం, గోధుమలు, బజ్రా, జొన్నలు వంటి వాటిపై కూడా 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు. ఆసుపత్రిలోని రూ. 5000 గదులపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించనుంది.

GST: వైద్య సేవలపై జీఎస్టీ తొలగించండి: కేంద్రానికి ఐఎమ్ఏ లేఖ

రూ. 1000 హోటల్ గదులపై 12 శాతం జీఎస్టీ, బ్లేడ్లు, పేపర్ కత్తెరలు, పెన్సిల్ షార్పనర్లు, స్పూన్లపై 18 శాతం జీఎస్టీని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇటీవల చండిగడ్ లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందిన తదుపరి..నేటి నుంచి నూతన పన్నులు అమల్లోకి రానున్నాయి.