ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : నలుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బస్తర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బీమాపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 03:36 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : నలుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బస్తర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బీమాపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బస్తర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బీమాపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. పోలీసుల కాల్పుల్లో 10 నుంచి 15 మంది మావోలకు గాయాలైనట్టు సమాచారం. ఘటనా స్థలంలో 2 నాటు తుపాకులు, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు పోలీసులుకు గాయాలయ్యాయి. బస్తర్ ఎస్పీ వివేకాంద సిన్హా కాల్పులను నిర్దారించారు.

మావోయిస్టుల కదలికల గురించి పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని బస్తర్ ఎస్పీ చెప్పారు. మంగళవారం తెల్లవారుజాము (మార్చి 26, 2019) పోలీసులు-మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని ఎస్పీ చెప్పారు.