Chhattisgarh : రైలు పట్టాలపై చెల్లాచెదురుగా మృతదేహాలు..తల్లి ఐదుగురు ఆడపిల్లలు

చత్తీస్‌గఢ్‌లో తల్లి తన ఐదుగురు కూతుళ్లతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మహాసముంద్ జిల్లాలోని ఓ గ్రామంలో విషాదాన్ని నింపింది. రైలు పట్టాలపై తల్లీ పిల్లలు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దృశ్యం అత్యంత బీతావహంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Chhattisgarh : రైలు పట్టాలపై చెల్లాచెదురుగా మృతదేహాలు..తల్లి ఐదుగురు ఆడపిల్లలు

Woman Five Girl Childrens Suicide (1)

woman five girl childrens Suicide : చత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఐదుగురు కూతుళ్లతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మహాసముంద్ జిల్లాలోని ఓ గ్రామంలో విషాదాన్ని నింపింది. దీంతో రైలు పట్టాలపై తల్లీ పిల్లలు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దృశ్యం అత్యంత బీతావహంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారి విచారణలో కుటుంబ కలహాలతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా నిర్ధారించారు.

మహాసముంద్ జిల్లా బెమ్చా గ్రామానికి చెందిన 45 ఏళ్ల ఉమా సాహు-రామ్ సాహు భార్యాభర్తలు. వీరికి ఐదుగురు అమ్మాయిలున్నారు. ఐదుగురు పిల్లలు 10 నుంచి 18 ఏళ్లలోపు వారే. ఉమా సాహుకు భర్త రామ్ కు తరచు గొడవలు జరుగుతుండేవి.ఈక్రమంలో బుధవారం (జూన్ 9,2021) భర్తతో ఉమకు గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తన ఐదురు అమ్మాయిలను తీసుకుని బుధవారం రాత్రి అయ్యాక తమ గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్లు దూరంలో మహాసముంద్‌–బెల్సొందా మార్గంలోని ఇమ్లిభట కెనాల్‌ వంతెనపైకి చేరుకుంది.

వేగంగా వస్తున్న రైలు కిందకు పిల్లలతో కలిసి దూకేసింది. దీంతో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గురువారం ఉదయం గమనించటంతో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేయగా కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తేలింది.

దీనిపై మహాసముండ్ పోలీస్ సూపరిండెండెంట్ ప్రపుల్ ఠాకూర్ మాట్లాడుతూ..భార్యాభర్తలు గొడవపడి పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకోవటంపై భర్త రామ్ ను ప్రశ్నించగా..భార్యాపిల్లల కోసం బంధుమిత్రులతో కలిసి వెతుకుతున్నాడని..ఈక్రమంలో రైల్వే ట్రాక్ మీద చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాల గురించి మాకు సమాచారం రావటంతో ఘటనాస్థలానికివెళ్లి పరిశీలించామని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ విచారణకు ఆదేశించారు.