Collegium : సుప్రీంలో జడ్జిల నియామకం..9 పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియాయమకానికి సంబంధించి 9 మంది జడ్జిల పేర్లను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం కేంద్రానికి సిఫార్సు చే

Collegium : సుప్రీంలో జడ్జిల నియామకం..9 పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం

Sc

Collegium సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియాయమకానికి సంబంధించి 9 మంది జడ్జిల పేర్లను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈమేరకు మంగళవారం సిఫార్సు చేసిన తొమ్మిది మంది పేర్లను ఇవాళ సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో ఉంచడం ద్వారా అన్ని ఊహాగానాలకు స్వస్తి చెప్పింది కొలీజియం. కొలీజియం సాఫార్సు జాబితాలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.

జాబితాలో ఉన్న తొమ్మిది మంది
జస్టిస్ ఏఎస్ ఒకా,విక్రమ్ నాథ్,జేకే మహేశ్వరి,హిమా కోహ్లీ,బీవీ నాగరత్న,సీటీ రవికుమార్,ఎమ్ఎమ్ సుంద్రేష్,బేలా త్రివేది మరియు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న పీసీ నరసింహ పేర్లు కొలిజీయం సిపార్లు జాబితాలో ఉన్నాయి.

హిమ కోహ్లీ.. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. బేలా త్రివేది.. గుజరాత్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. విక్రమ్ నాథ్..గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిగ్ గా ఉన్నారు. జె.కె మహేశ్వరీ..సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌ గా ఉన్నారు. అభయ్ ఓకా.. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. బీవీ నాగరత్న..కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్నారు. సీటీ రవికుమార్..కేరళ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఎమ్ ఎమ్ సుంద్రేష్..మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. కాగా, కొలీజియం సిఫార్సు చేసిన పీసీ నరసింహ సుప్రీంకోర్టులో లాయర్ గా ఉన్నారు. పీసీ నరసింహ  నియామకానికి కేంద్రప్రభుత్వం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే..బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకి ఎంపికయ్యే తొమ్మిదవ లాయర్ గా నిలుస్తారు.

కాగా,కొలిజీయం సిఫార్సు చేసిన పేర్లలో ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ BV నాగరత్న కూడా ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈమె నియామకం ఖరారు అయితే మాత్రం 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీవీ నాగరత్న అయ్యే అవకాశముంది. అదే జరిగితే భారత ప్రధాన తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.

ఇక, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తలుగా ఏడుగురి పేర్లను కొలిజీయం సిఫార్సు చేసింది.
CJI NV Ramana : సుప్రీం జడ్జిల నియామకాల వార్తలపై సీజేఐ తీవ్ర అసంతృప్తి