Covid-19 wave : వచ్చే 4 వారాలే కీలకం.. సెకండ్ వేవ్ వెరీ డేంజరస్.. కేంద్రం హెచ్చరిక

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. వచ్చే నాలుగు వారాలే అత్యంత కీలకం.. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో వైరస్‌తో పోలిస్తే కొత్త వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

Covid-19 wave : వచ్చే 4 వారాలే కీలకం.. సెకండ్ వేవ్ వెరీ డేంజరస్.. కేంద్రం హెచ్చరిక

Coming 4 Weeks Very Critical

Coming 4 weeks very critical : భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. వచ్చే నాలుగు వారాలే అత్యంత కీలకం.. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో వైరస్‌తో పోలిస్తే కొత్త వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దేశప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించాలని హెచ్చరించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని నీతిఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ అన్నారు.

దేశంలో అన్ని వయసుల వారికి వ్యాక్సిన్‌ అందించాలన్న డిమాండ్‌లపై పాల్‌ స్పందించారు. వైరస్‌ ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికే ముందుగా టీకాను అందిస్తామన్నారు. వ్యాక్సిన్‌ అవసరమైన వారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 96,982 కరోనా కేసులు నమోదయ్యాయి. 446 మంది మరణించారు. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 43 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించారు. టీకా తీసుకున్నవారి సంఖ్య 8,31,10,926కు చేరింది.

దేశ జనాభాను బట్టి చూస్తే తక్కువ కేసులు, కరోనా మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌ తెలిపారు. మహారాష్ట్రలోని ఏడు జిల్లాలు, ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో జిల్లాలో యాక్టివ్‌ కేసులు ఉన్నాయని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.

కర్ఫ్యూ సమయాల్లో వ్యాక్సినేషన్‌ కోసం వెళ్లే వారు ఈ-పాస్‌ను తీసుకువెళ్లాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లే గర్బిణిలు, రోగులు సంబంధిత టికెట్లను తీసుకువెళ్లాలన్నారు. చండీగఢ్‌లో కూడా రాత్రి కర్ఫ్యూ విధించారు. మహారాష్ట్రలోని పుణెలో కరోనా విజృంభిస్తోంది. రోగుల చికిత్సకు తగినంత బెడ్లు లేవు. ఆస్పత్రుల ఆవరణలో టెంట్లు వేసి కొవిడ్‌ రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆస్పత్రుల్లో 400 పడకలు ఉండగా, రోగులతో అన్నీ నిండిపోయాయని, కొత్తగా వచ్చే రోగులను వెనక్కి పంపించలేక టెంటు కింద ఆక్సిజన్‌ ట్రీట్ మెంట్ ఏర్పాటు చేశామని చెబుతున్నారు. వారాంతాల్లో బీచ్‌లు, గార్డెన్లు, గ్రౌండ్లను మూసివేస్తూ ముంబై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మిగతా రోజుల్లో కూడా కఠిన ఆంక్షలను విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు బీచ్‌లు, గార్డెన్లు, మైదానాలను మూసివేస్తున్నట్టు వెల్లడించారు.