LPG Cylinder Rates: గుడ్‌న్యూస్.. తగ్గిన కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. రూ. 92 తగ్గిస్తూ పెట్రొలియం సంస్థలు నిర్ణయించాయి. అయితే, గృహ అవసరాలకోసం వినియోగించే గ్యాస్ సిలీండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తగ్గిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

LPG Gas
LPG Cylinder Rates: ఎల్పీజీ వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించింది. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలీండర్ ధర భారీగా తగ్గింది. పెట్రోలియం కంపెనీలు సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజైన ఏప్రిల్ 1వ తేదీన ఎల్‌పీజీ సిలీండర్ల ధరలను సవరిస్తాయి. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరం నేటి నుంచి ప్రారంభం కావడంతో వాణిజ్య సిలిండర్ వినియోగించే వారికి గుడ్‌న్యూస్ చెప్పాయి. 19కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలీండర్ ధరపై రూ. 92 తగ్గిస్తూ నిర్ణయించాయి. అయితే, దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర మారదు.
LPG Cylinder Price : ప్రజలపై మరో భారం.. భారీగా పెరిగిన సిలిండర్ ధర
గత నెలలో కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల గ్యాస్ సిలీండర్ల ధరను రూ. 50, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను రూ. 350 పెంచిన విషయం విధితమే. అయితే, వాణిజ్య సిలిండర్ల ధరలో నేటి నుంచి రూ. 92 తగ్గనుంది. తగ్గించిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో నేటి నుంచి ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రూ. 2,028కి అందుబాటులో ఉంటుంది. తగ్గిన ధరల ప్రకారం.. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్‌లలో ధరల వివరాలను చూస్తే.. ఢిల్లీ – 2,028, కోల్‌కతా రూ. 2,132, ముంబై రూ. 1,980, చెన్నై రూ. 2,192.50, హైదరాబాద్ రూ. 2,325.
LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
వాణిజ్య గ్యాస్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. గతేడాది ఏప్రిల్ నెలలో ఢిల్లీలో19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,253 ఉండగా, నేడు అదే ధర రూ. 2,028కి తగ్గింది. ఏడాదికాలంలో వాణిజ్య గ్యాస్ సిలాండర్ ధరలు రూ. 225 తగ్గాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 1,103, శ్రీనగర్ లో 1,219, బెంగళూరులో రూ. 1,115.5, ముంబైలో రూ. 1,112.5, విశాఖపట్టణంలో రూ. 1,111, చెన్నైలో 1,118.5 గా ఉన్నాయి.