బీజేపీ x కాంగ్రెస్.. ఫేస్‌బుక్‌తో రాజకీయ దుమారం

  • Published By: sreehari ,Published On : August 17, 2020 / 07:38 PM IST
బీజేపీ x కాంగ్రెస్.. ఫేస్‌బుక్‌తో రాజకీయ దుమారం

మనదేశంలో ఫేస్‌బుక్ వ్యవహారంపై దుమారం రేగింది.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఫేస్‌బుక్‌పై రాజకీయ రగడ జరుగుతోంది.. ఈ అంశంపై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించిన కథనంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది.. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రకటనలను ఇస్తున్నారని వాల్ స్ట్రీట్ నివేదించింది.

అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల యుద్ధానికి దారితీసింది.. విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ నేతల చేస్తున్న ప్రకటనలను యథతథంగా ఫేస్ బుక్‌లో పెడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… ఫేస్ బుక్ పూర్తిగా బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి.



బీజేపీ ఎమ్మెల్యే రోహింగ్యాలపై చేసిన కామెంట్లను యథాతథంగా ఇచ్చారని కథనం ప్రచురించింది.. వ్యాపార ప్రయోజనాల కోసం ఫేస్ బుక్ కమలనాథులకు అనుకూలంగా వాఖలత పుచ్చుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి..

ఈ కథనంపై ప్రతిపక్షాలు బీజేపీని టార్గెట్ చేశాయి.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు ఫేస్ బుక్ తీరును తప్పుబట్టారు.. బీజేపీ నేతలు ఫేస్ బుక్, వాట్సాప్ ఉపయోగించుకుని విద్వేషాలు రెచ్చగొడు తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాదించారు.



ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాషాయ దళం ఫేస్ బుక్ ను వినియోగించుకుంటుందని ఆయన విమర్శించారు. మరోవైపు రాహుల్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఫేస్ బుక్ కథనాలను వాడుకున్నది కాంగ్రెస్ అని చెప్పి కమలనాథులు విమర్శించారు..

ఇంకోవైపు.. తమపై వచ్చిన ఆరోపణలను ఫేస్ బుక్ తిప్పికొట్టింది.. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. ఏ దేశంలోనూ పార్టీలకు రాజకీయాలకు అనుకూలంగా వత్తాసు పలికే విధానం తమకు లేదని పేర్కొంది.. ప్రజల మధ్య హింసా విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలను నిషేధించామనే విషయాన్ని వెల్లడించింది..