ఇది సాధ్యమేనా : ప్రతి నెలా రూ.6వేలు, కనీస ఆదాయం రూ.12వేలు

ఇది సాధ్యమేనా : ప్రతి నెలా రూ.6వేలు, కనీస ఆదాయం రూ.12వేలు

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అత్యంత పేదరికంలో
ఉన్న ఐదు కోట్ల కుటుంబాలకు ప్రతి నెలా 6 వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తానని చెప్పటం
సంచలనంగా మారింది. అదేకాదు ప్రతి కుటుంబానికి కనీసం ఆదాయం 12వేల రూపాయలు
వచ్చే విధంగా ఉపాధి కల్పించనున్నట్ల హామీ ఇచ్చారు. ఇది సాధ్యమేనా అనే అనుమానాలు
వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో బ్లాక్ మనీ బయటకు వస్తే ఒక్కో
ఖాతాలో 15 లక్షల రూపాయల డబ్బు పడుతుందనే ప్రచారం జరిగింది. రూపాయి కూడా పడలేదు. ఇప్పుడు ప్రతినెలా 6వేల రూపాయలు వేస్తాం అని కాంగ్రెస్ అంటోంది.జనం నమ్ముతారా లేదా అనేదితర్వాత సంగతి.. సాధ్యమా కాదా అనేది చూద్దాం.

– దేశంలో అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలు 5 కోట్లు. వీరి జనాభా 25 కోట్లు. ఒక్కో కుటుంబానికి నెలకు 6వేల చొప్పున.. ఐదు కోట్ల కుటుంబాల కింద లెక్క కడితే నెలకు 30వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.- ఇదే ఏడాది అయితే 3లక్షల 60వేల కోట్లుగా ఉండనుంది. 2019-20 కేంద్ర బడ్జెట్ ఖర్చులో ఇది 13శాతంగా ఉంది.-2019-20 ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు ఇది రెట్టింపుగా ఉండనుంది. మోడీ ప్రభుత్వం 3.27లక్షల కోట్లను మోడీ ప్రభుత్వం కేటాయించింది.కాంగ్రెస్ ప్రకటించిన నెలకు 6వేలు, కనీసం ఆదాయం 12వేల రూపాయలు లెక్కలు వేస్తే మాత్రం.. కేవలం ఈ ఒక్క పథకానికే ఏడాదికి 6 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

-ఒకే ఒక్క పథకానికి ఏడాదికి 6 లక్షల కోట్లు ఖర్చు చేయటం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.- అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను కూడా ఇందులోకి తీసుకురావటం వల్లే సాధ్యమే అంటున్నారు కొందరు ఆర్థిక విశ్లేషకులు. అంటే ఉపాధి హామీ పథకం, ఇతర పథకాలను ఇందులో కలిపేయటం ద్వారా సాధ్యం అంటున్నారు.ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి ఒక్క పేద కుటుంబం నెలకు రూ.12వేల ఆదాయం పొందేలా చేస్తామని తెలిపారు. ఉదాహరణకు ఒక కుటుంబం నెలకు రూ.6,000 సంపాదిస్తుందనుకుంటే దానిని నెలకు రూ.12వేలకు పెంచుతామని రాహుల్ అన్నారు.