ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్…విపక్ష నాయకులతో మోడీ వీడియోకాన్ఫరెన్స్

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2020 / 12:52 PM IST
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్…విపక్ష నాయకులతో మోడీ వీడియోకాన్ఫరెన్స్

దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు వేగంగా పెరిగిపోతున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొచ్చింది కేంద్రం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన’ (పిఎంజెఎవై) ను నడుపుతున్న ‘నేషనల్ హెల్త్ అథారిటీ’ ఈ పథకం పరిధిలో కరోనా వైరస్ పరీక్ష మరియు చికిత్స ఖర్చులను తీసుకువచ్చిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయుష్మాన్ పథకం కింద ఉచితంగా కరోనాకు ట్రీట్మెంట్ ను అందించనున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2వేల 902గా ఉంది. 68కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 30శాతం కేసులు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారివే. తబ్లిగీ జమాత్ ప్రభావంతో 17రాష్ట్రాలకు కరోనా వైరస్ పాకింది. దేశం మొత్తం కరోనా కేసుల్లో 1023 కేసులు  తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారివే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో  కరోనా కేసుల సంఖ్య 190కి చేరుకుంది. ఏపీలో  ఇవాళ ఒక్కరోజే 26 కేసులు నమోదయ్యాయి. అయితే ఏపీలో కూడా 90శాతం కరోనా కేసులు బ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారివే.

మరోవైపు కరోనా సంక్షోభంపై… లోక్ సభ,రాజ్యసభ లో ఐదుగురు కన్నా ఎక్కువమంది ఎంపీలను కలిగి ఉన్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఏప్రిల్-8,2020న ఉదయం 11గంటలకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు, దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత విపక్ష నాయకులతో ప్రధాని మొదటిసారి ఇంటరాక్ట్ అవుతున్నారు అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మీటింగ్ సమయంలో దేశవ్యాప్త లాక్ డౌన్ గురించి ప్రధానంగా చర్చించే అవకాశముంది.