Coronavirus Updates: మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కేరళలోనే ఎక్కువగా!

రెండేళ్ల నుంచి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది.

Coronavirus Updates: మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కేరళలోనే ఎక్కువగా!

Corona (3)

India Coronavirus Updates: రెండేళ్ల నుంచి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది. మూడో వేవ్ వస్తుందంటూ వార్తలు వినిపించినా కేసులు తగ్గుతూనే ఉండడంతో కాస్త ఊపిరి పిల్చుకుంటున్నారు డాక్టర్లు. భారతదేశంలో కరోనా వైరస్ కేసులలో నిరంతర హెచ్చుతగ్గులు కనిపిస్తుండగా.. లేటెస్ట్‌గా విడుదలైన డేటా ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 22 వేల 431 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో ఇప్పటివరకు మూడు కోట్ల 38లక్షల 94వేల 312 కరోనా కేసులు నమోదయ్యాయి, ఇందులో ఇప్పటివరకు నాలుగు లక్షల 49 వేల 856 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటివరకు 3కోట్ల 32లక్షల 258మంది కోలుకున్నారు. ఇదే సమయంలో కరోనా కారణంగా దేశంలో 318 మంది చనిపోయినట్లుగా ఆరోగ్యశాఖ ప్రకటించింది.

గడిచిన 24 గంటల్లో 24 వేల 602 మంది కోలుకోగా.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 44వేల 198కి చేరుకుంది. అంతకుముందు రోజుతో పోలిస్తే, కరోనా కేసులు పెరిగాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.

ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం 92 కోట్లు దాటిందని వెల్లడించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR). దేశంలో ఒక్క కేరళలోనే ఎక్కువగా కేసులు వస్తూ ఉన్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 12వేల 616కేసులు నమోదవగా.. 134 మంది ఇదే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న ఏకైక రాష్ట్రం కేరళనే.