మాస్క్‌లు పెట్టుకోకుండా తిరుగుతూ కోవిడ్ రోగులు ఆందోళ‌న..‌హడలిపోయిన వైద్యసిబ్బంది

  • Published By: nagamani ,Published On : June 1, 2020 / 05:28 AM IST
మాస్క్‌లు పెట్టుకోకుండా తిరుగుతూ కోవిడ్ రోగులు ఆందోళ‌న..‌హడలిపోయిన వైద్యసిబ్బంది

కరోనా సోకిన రోగులు ఆందోళన చేపట్టారు. మాకు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించట్లేదు అంటూ..మాస్క్ లు తీసివేసి నిరసనను వ్యక్తం చేస్తూ..హాస్పిటల్ అంతా కలియతిరిగిన ఘటన  ఉత్త‌రాఖండ్‌లో చోటు చేసుకుంది.తాము ఉంటోన్న‌ ఐసోలేష‌న్ వార్డులో స‌రైన సౌక‌ర్యాలు కల్పించ‌ట్లేదనీ..శానిటైజేష‌న్ చేయ‌‌ట్లేద‌ని ఆందోళ‌న‌కు మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతూ ఆస్పత్రి సిబ్బందిని భ‌యాందోళ‌న‌కు గురి చేశారు. దీనికోసం తాము ఎంతగా చెప్పినా సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవాట్లేదని వాపోయారు. దీంతో ఆందోళన చేయకతప్పలేదంటున్నారు.  

దీనిపై ఉత్త‌రకాశీ పోలీస్ స్టేష‌న్ ఇన్‌చార్జి మ‌హ‌దేవ్ ఉనియాల్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. క‌రోనా సోకిన ముగ్గురు వ‌ల‌స కార్మికులు స్థానిక‌ ఆస్పత్రిలో క‌రోనా బారిన ప‌డ్డ ముగ్గురు వ‌ల‌స కార్మికులు తాము ఉంటోన్న ఐసోలేష‌న్ వార్డు నిర్వ‌హ‌ణపై అసంతృప్తి వ్య‌క్తం చేశారనీ..శానిటైజేష‌న్ స‌రిగా లేకపోవటంతో పాటు క‌నీసం మెడిక‌ల్ రిపోర్ట్స్ విషయంలో కూడా నిర్లక్ష్యం చూపుతున్నారనీ..నిర‌స‌న‌కు దిగారని తెలిపారు. 

దీనికి సంబంధించి ఓ కరోనా బాధితుడు దులో ఐసోలేష‌న్‌ వార్డులో ఉన్న సౌక‌ర్యాల‌పై వీడియో కూడా తీశారనీ..తెలిపారు. మాస్కులు పెట్టుకోకుండా..తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేశారనీ..దీంతో హాస్పిటల్ సిబ్బంది సమాచారం మేరకు ఆ ముగ్గురు వ‌ల‌స కార్మికుల‌పై కేసు న‌మోదు చేశామని తెలిపారు. 

కాగా..దీనిపై జిల్లా వైద్యాధికారి ఎస్‌డీ సాక్లానీ  మాట్లాడుతూ..క‌రోనా పేషెంట్లు ఉండే వార్డుల‌ను ప్రతీరోజు..రోజుకు పలుసార్ల శానిటైజేష‌న్ చేస్తున్నామ‌ని కరోనా రోగులు ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదని అంటున్నారు. క‌రోనా బాధితుల‌ కోసం తమ సిబ్బంది నిరంత‌రం శ్ర‌మిస్తున్నార‌ని తెలిపారు. 

Read: వరుసగా రెండవరోజు భారత్‌లో 8వేలకు పైగా కరోనా కేసులు..