ICMR Study : డెల్టా ప్లస్ వేరియంట్ పైనా ప్రభావవంతంగా పనిచేస్తున్న కోవాగ్జిన్

ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ పై "కోవాగ్జిన్" ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.

ICMR Study : డెల్టా ప్లస్ వేరియంట్ పైనా ప్రభావవంతంగా పనిచేస్తున్న కోవాగ్జిన్

ICMR Study ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ పై “కోవాగ్జిన్” ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. కరోనా కట్టడి కోసం హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ..నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV),ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన “కోవాగ్జిన్”టీకా డెల్టా ప్లస్ వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తమ తాజా అధ్యయనంలో తేలిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సోమవారం తెలిపింది.

ఇక,మొత్తంగా కోవిడ్ -19పై 77.8శాతం సమర్థవంతంగా కోవాగ్జిన్ పనిచేస్తుందని,కొత్త కోవిడ్ డెల్టా వేరియంట్ పై కోవాగ్జిన్ 65.2శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు గత నెలలో భారత్ బయోటెక్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, దేశంలో కోవిడ్ డెల్టా ప్లస్ కేసుల సంఖ్య 70కి పైగా ఉందని గత వారం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్ కి తెలిపిన విషయం తెలిసిందే.