Omicron: ఒమిక్రాన్ మంచికేనా? దేశంలో 4వేలు దాటిన కేసులు!

ఒమిక్రాన్ మన మంచికేనా..? ఒమిక్రాన్‌తో కరోనా ఎండ్ అయ్యే స్టేజ్‌కు చేరుకుంటుందా?

Omicron: ఒమిక్రాన్ మంచికేనా? దేశంలో 4వేలు దాటిన కేసులు!

Omicron

Covid-19 Omicron: ఒమిక్రాన్ మన మంచికేనా..? ఒమిక్రాన్‌తో కరోనా ఎండ్ అయ్యే స్టేజ్‌కు చేరుకుంటుందా? రెండేళ్లుగా ప్రపంచాన్ని పీక్కుతింటున్న మహమ్మారి నుంచి విముక్తి చేసేందుకే ఒమిక్రాన్‌ వచ్చిందా? అవుననే అంటున్నారు నిపుణులు. ఒమిక్రాన్‌తో అంతా మంచే జరగనుందట..! కరోనా కారు చీకట్లను చీల్చడానికి ఒమిక్రాన్‌ వేవ్‌ ఉపయోగపడనుందట..!

ప్రపంచాన్ని కుదిపేసే మహమ్మారులకు ముగింపు ఉంటుంది. కరోనా కూడా అలాంటిదే. ఒమిక్రాన్‌ తర్వాత కరోనా ఎండమిక్‌ స్టేజ్‌కు చేరుకుంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు. ‘ఫ్లూ తరహాదశ’కు కొవిడ్‌ చేరుకునే అవకాశం ఉందని, భవిష్యత్‌లో సాధారణ జలుబు లాగానే కరోనా ఉండనున్నట్లు చెబుతున్నారు.

ఒమిక్రాన్‌ సృష్టిస్తున్న కేసుల విధ్వంసంతో ప్రతీఒక్కరిలో యాంటిబాడిలు వచ్చి చేరి కరోనాను సమర్ధంగా ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. లేటెస్ట్‌గా భారత్‌లో నాలుగు వేల ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు దాటాయి. దేశవ్యాప్తంగా 4వేల 33కు ఒమిక్రాన్ కేసులు చేరుకోగా.. ఇప్పటివరకు 1552మంది కరోనా నుంచి కొలుకున్నారు.

మొత్తం 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర ఉండగా.. రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,216కేసులు, రాజస్థాన్‌లో 529, ఢిల్లీలో 513, కర్ణాటక 441, కేరళలో 333, గుజరాత్ 236, తమిళనాడు 185, హర్యానా 123, తెలంగాణ 123, ఉత్తరప్రదేశ్ 113, ఒడిశా 74, ఏపీలో 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.