COVID-19 Second Wave: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గురించి సైంటిస్టుల షాకింగ్ న్యూస్, ఏప్రిల్ రెండోవారంలో ఉగ్రరూపం

కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ తీవ్రత మామూలుగా లేదు. దేశంలో రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా రోజువారీ కేసుల సంఖ్య 81వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇది శాంపుల్ మాత్రమే అని, ముందు ముందు కోవిడ్ తీవ్రత మరింత అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు.

COVID-19 Second Wave: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గురించి సైంటిస్టుల షాకింగ్ న్యూస్, ఏప్రిల్ రెండోవారంలో ఉగ్రరూపం

Covid 19 Second Wave In India May Peak By Mid April1

COVID-19 Second Wave Peak : కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ తీవ్రత మామూలుగా లేదు. దేశంలో రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా రోజువారీ కేసుల సంఖ్య 81వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇది శాంపుల్ మాత్రమే అని, ముందు ముందు కోవిడ్ తీవ్రత మరింత అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మే చివరి నాటికి తీవ్రత తగ్గే ఛాన్స్:
తాజాగా సైంటిస్టులు చెప్పిన విషయం ప్రజల్లో భయాందోళనలు పెంచింది. దేశంలో సెకండ్‌ వేవ్‌ మార్చి నెలలో ప్రారంభమైనట్లు గుర్తించగా.. ఈ విజృంభణ ఏప్రిల్‌ నెల రెండో వారం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అలా కొనసాగుతూ మే చివరి నాటికి వైరస్‌ తీవ్రత తగ్గే చాన్స్ ఉందన్నారు.

సెకండ్ వేవ్ ఉద్ధృతిపై అంచనా:
దేశంలో కరోనా తొలి దశ ఉద్ధృతి కొనసాగిన సమయంలో వైరస్‌ తీవ్రతను సూత్రా(SUTRA) అనే గణాంక పద్ధతి(Mathematical Approach) ద్వారా కాన్పూర్‌ ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2020 సెప్టెంబర్‌ నెలలో వైరస్‌ తీవ్రత గరిష్ఠానికి చేరుకొని.. 2021 ఫిబ్రవరి నాటికి తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అదే తరహాలో ప్రస్తుతం రెండో దశ కొవిడ్‌ ఉద్ధృతిని కూడా అంచనా వేస్తున్నారు.

లక్షకుపైగానే కేసులు నమోదు:
‘ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల తీరును చూస్తే ఏప్రిల్ 15-20వ తేదీ మధ్యకాలంలో గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉంది. అదే తీరుతో కాస్త తగ్గుముఖం పడుతూ.. మే చివరి నాటికి గణనీయంగా తగ్గుతుంది’ అని అధ్యయనంలో పాల్గొన్న ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్త మనీంద్రా అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువయ్యిందని.. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగి.. చివరకు తగ్గుముఖం పడుతుందన్నారు.

ఆ రెండు రాష్ట్రాల్లో గరిష్ఠ స్థాయికి కేసులు:
ఇప్పుడున్న తీవ్రతను బట్టి చూస్తే మహారాష్ట్ర, ఆ తర్వాత పంజాబ్‌ రాష్ట్రాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అంచనా వేశారు. రాష్ట్రాల వారీగా కేసుల్లో తేడా ఉన్నప్పటికీ ఏప్రిల్‌ రెండో వారం నాటికి వైరస్‌ ఉద్ధృతి గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు. హరియానాలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్‌ మేనన్‌ అంచనా ప్రకారం కూడా ఏప్రిల్‌, మే నాటికి వైరస్‌ ఉద్ధృతి అధిక స్థాయికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు.

వైరస్‌ ఉద్ధృతి గరిష్ఠ స్థాయికి చేరే అంశాన్ని అంచనా వేయడంలో మూడు అంశాలు కీలకంగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా వైరస్‌ వ్యాప్తి రేటు (ఆర్‌ నాట్‌), వైరస్‌ సోకే అవకాశమున్న జనాభా, నిర్ధారితమవుతున్న కేసులను ఆధారం చేసుకుని ఈ విధానంలో అంచనా వేస్తున్నట్లు కాన్పూర్‌ శాస్త్రవేత్తలు వివరించారు. నిర్ధారణ పరీక్షల సంఖ్యను బట్టి వెలుగుచూసే కొవిడ్‌ కేసుల్లో మార్పులు ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.

24గంటల్లో 81వేల 466 కరోనా కేసులు, 469 మరణాలు:
కాగా, గతంలో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో నమోదైనన్ని కేసులు తిరిగి తాజాగా నమోదవుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 81వేల 466 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా కారణంగా 469 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,03,131కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం(ఏప్రిల్ 2,2021) ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 6,14,696 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1,15,25,039 కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కారణంగా 1,63,396 మంది మృతి చెందారు. ఒక్కరోజే 50,356 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.68% కాగా.. మరణాల రేటు 1.33%గా ఉంది.