SBI Ecowrap Report : సెకండ్‌ వేవ్‌ తరహాలోనే…కరోనా థర్డ్ వేవ్‌ పై ఎస్బీఐ షాకింగ్ రిపోర్ట్

కరోనా సెకండ్‌ వేవ్‌ తరహాలోనే థర్డ్ వేవ్‌ కూడా అంతే తీవ్రంగా ప్రభావం చూపొచ్చని SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)Ecowrap రిపోర్ట్ అంచనా వేసింది.

SBI Ecowrap Report : సెకండ్‌ వేవ్‌ తరహాలోనే…కరోనా థర్డ్ వేవ్‌ పై ఎస్బీఐ షాకింగ్ రిపోర్ట్

Sbi Ecowrap Report

SBI Ecowrap Report కరోనా సెకండ్‌ వేవ్‌ తరహాలోనే థర్డ్ వేవ్‌ కూడా అంతే తీవ్రంగా ప్రభావం చూపొచ్చని SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)Ecowrap రిపోర్ట్ అంచనా వేసింది. కరోనా థర్డ్ వేవ్ పై.. ఎకోరాప్ పేరిట ఎస్బీఐ ఇవాళ విడుదల చేసిన తన ఐదు పేజీల సుదీర్ఘ రిపోర్ట్ లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. కరోనా ధర్డ్‌ వేవ్‌ ప్రభావం, దాని లక్షణాలు, ఎన్ని రోజులు ఉండొచ్చన్న అంశాలను నివేదికలో వెల్లడించింది.

అంతర్జాతీయ అనుభవాల్ని బట్టి చూస్తే కరోనా ధర్డ్‌వేవ్‌ 98 రోజులు ఉండొచ్చని ఎస్బీఐ తెలిపింది. వివిధ దేశాల్లో ధర్డ్‌వేవ్ ప్రభావం దాదాపు ఇంతే సమయం ఉందని తెలిపింది. ప్రస్తుతం సెకండ్ వేవ్‌ను 108 రోజులు ఉండగా… ధర్డ్‌ వేవ్‌ మాత్రం పది రోజులు తక్కువగా ఉండొచ్చని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే ధర్డ్‌వేవ్‌ పీక్‌ స్ధాయిలో 1.8 రెట్లు ఉండొచ్చని చెబుతోంది. కరోనా ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ 5.2 రెట్లు అధికంగా ఉంది.

అయితే, కరోనా సెకండ్‌ వేవ్‌లో భారీ సంఖ్యలో మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో థర్డ్‌ వేవ్‌ పై మాత్రం ఎస్బీఐ రిపోర్ట్‌ ఓ గుడ్ న్యూస్ చెప్పంది. అప్రమత్తంగా ఉండటం ద్వారా థర్డ్‌ వేవ్‌ లో మరణాల్ని అరికట్టొచ్చని తెలిపింది. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌లో ఇప్పటివరకూ 1.7 లక్షలకు పైగా మరణాలు నమోదవగా..థర్డ్‌ వేవ్‌ లో అప్రమత్తంగా ఉండటం ద్వారా మరణాల సంఖ్యను 40 వేలకు పరిమితం చేయవచ్చని తెలిపింది. వ్యాక్సినేషన్..ముఖ్యమైన ప్రాధాన్యతగా ఉండాలని ప్రభుత్వానికి ఎస్బీఐ సూచించింది. ముఖ్యంగా,థర్డ్ వేవ్ చిన్నారులపై అధిక ప్రభావం చూపే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో..12-18 ఏళ్ళ వయస్సులో ఉన్న 15-17 కోట్ల మందికి టీకాలు వేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు అనుసరించిన ఒక అధునాతన సేకరణ వ్యూహాన్ని భారతదేశం అనుసరించాలని ఎస్బీఐ ఎకోరాప్ రిపోర్ట్ తెలిపింది.