India : ఆగస్టులో థర్డ్ వేవ్..సెప్టెంబర్ లో తీవ్రస్థాయి..జాగ్రత్త గా ఉండకపోతే కష్టమే

కరోనా వేవ్ ల వారీగా జనాలను హడలెత్తిస్తోంది. ఫస్ట్ వేవ్ లో భయపెట్టేసింది. సెకండ్ వేవ్ లో ప్రజల ప్రాణాల్ని హరించేసింది. ఇక థర్డ్ వేవ్ పరిస్థితి తలచుకుంటేనే హడలిపోతున్నారు జనాలు. సెకండ్ వేవ్ లో కేసులు తగ్గుతున్నాయని సంబరపడాలో థర్డ్ వేవ్ లో పరిస్థితిని తలచుకుని భయపడాలో అర్థం కాని పరిస్థితి. ఈక్రమంలో భారత్ లో థర్డ్ వేవ్ ఆగస్టులో తాకుతుందని అది సెప్టెంబర్ నాటికి తీవ్రస్థాయికి చేరుతుందని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి.

India : ఆగస్టులో థర్డ్ వేవ్..సెప్టెంబర్ లో తీవ్రస్థాయి..జాగ్రత్త గా ఉండకపోతే కష్టమే

Covid Third Wave In Bharath

Covid Third wave In Bharath : కరోనా వేవ్ ల వారీగా జనాలను హడలెత్తిస్తోంది. ఫస్ట్ వేవ్ లో భయపెట్టేసింది. సెకండ్ వేవ్ లో ప్రజల ప్రాణాల్ని హరించేసింది. ఇక థర్డ్ వేవ్ పరిస్థితి తలచుకుంటేనే హడలిపోతున్నారు జనాలు. సెకండ్ వేవ్ లో కేసులు తగ్గుతున్నాయని సంబరపడాలో థర్డ్ వేవ్ లో పరిస్థితిని తలచుకుని భయపడాలో అర్థం కాని పరిస్థితి. ఈక్రమంలో ఆగస్టు నెలలోనే థర్డ్ వేవ్ భారత్ లో ఉంటుందని దాని తీవ్రత సెప్టెంబర్ లో తీవ్రస్థాయిలో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పటి నుంచే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

థర్డ్ వేవ్ వచ్చే నెలలో అంటే ఆగస్టులో భారతదేశానికి ఉంటుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. ఆగస్టు 2021 నాటికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు భారతదేశాని ఉంటుందని తెలిపింది. ఎస్బిఐ రీసెర్చ్ ప్రచురించిన నివేదికకు ‘కోవిడ్ -19: రేస్ టు ఫినిషింగ్ లైన్’ అని పేరు పెట్టారు. కరోనా మూడవ వేవ్ 2021 సెప్టెంబర్‌లో తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఈ నివేదిక వెల్లడించింది.

SBI నివేదిక భారతదేశంలో సెకండ్ వేవ్ కేసుల పెరుగుదల ఏప్రిల్ లో మొదలై ఇది మే 7 న గరిష్ట స్థాయికి చేరుకుందని వెల్లడించింది. రెండవ వేవ్ ఏప్రిల్‌లో భారతదేశాన్ని తాకి మేలో గరిష్ట స్థాయికి చేరుకుందని, కరోనా సెకండ్ వేవ్ ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ మరియు ఇతర రాష్ట్రాల్లోని లక్షలాది కుటుంబాలను ఛిద్రం చేసిందని వెల్లడించింది. ఈక్రమంలో జూలై రెండవ వారంలో నిదానంగా చాపకింద నీరులా మొదలై ఆగస్టు రెండవ వారం నాటికి భారత్ లో థర్డ్ వేవ్ పెరుగుతుందని అది సెప్టెంబర్ లో తీవ్రస్తాయికి చేరుతుందని తెలిపింది.

ఈ థర్డ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారకుండా ఇప్పటి నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ముప్పు మాత్రం పొంచి ఉందని, అలెర్ట్ గా లేకుంటే సెకండ్ వేవ్ తరహాలో మరిన్ని ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.