PM Modi : హిల్ స్టేష‌న్స్‌ లో,మార్కెట్లలో మాస్కులు లేకుండా గుమిగూడటం ఆందోళ‌న‌క‌రం

కులు,మనాలీ,ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతున్న ఫొటోలు ఇటీవల బయటికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై దీనిపై స్పందించారు.

PM Modi : హిల్ స్టేష‌న్స్‌ లో,మార్కెట్లలో మాస్కులు లేకుండా గుమిగూడటం ఆందోళ‌న‌క‌రం

Modi (3)

PM Modi కులు,మనాలీ,ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతున్న ఫొటోలు ఇటీవల బయటికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై దీనిపై స్పందించారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కులు క‌రోనా నిబంధ‌న‌ల‌ను స‌రిగా పాటించడంలేద‌ని..హిల్ స్టేష‌న్స్‌లో, మార్కెట్‌ల‌లో ఫేస్ మాస్కులు లేకుండా జ‌నం భారీ సంఖ్య‌లో గుమిగూడటం ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యమ‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా క‌రోనా నిబంధ‌న‌లు పాటించేలా చూడాల‌ని ఈశాన్య రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు మోదీ సూచించారు.

దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యంత్రుల‌తో ప్ర‌ధాని మోదీ మంగళవారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రుల‌తో మోదీ మాట్లాడుతూ..దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌న్నారు. ప‌రిస్థితి చేయిదాట‌క ముందే మ‌నం మ‌హ‌మ్మారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. థర్డ్ వేవ్ కోవిడ్ కేసులను నివారించడానికి ప్రాథమిక నియమాలకు కట్టుబడి ఉండవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. బహిరంగంగా ఉన్నప్పుడు ఫేస్ మాస్క్‌లు ధరించడం, పెద్ద సమావేశాలకు(large gatherings)దూరంగా ఉండటం మరియు వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం వంటి విషయాలను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

కరోనా వైరస్ కారణంగా టూరిజం,వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నది నిజమేనని కానీ హిల్ స్టేషన్లు(పర్యాటక ప్రాంతాలు)మరియు మార్కెట్లలో మాస్క్ లు ధరించకుండా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుతుండటం మంచిది కాదని తాను గట్టిగా చెప్పాలనుకుంటున్నానని మోదీ అన్నారు. వైరస్ దానికదే రావడం మరియు పోవడం ఉండదన్నారు. మనమే నిబంధనలను ఉల్లంఘించినప్పుడు దానిని మనతో తీసుకువస్తామన్నారు. అజాగ్రత్త ప్రవర్తన – అధిక రద్దీ వంటివి కోవిడ్ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్న విషయాన్ని మోదీ సందర్భంగా ప్రస్తావించారు. జన సమూహాలను(crowds)ని నివారించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా ఆపడానికి రాష్ట్రాలు-కేంద్ర ప్రభుత్వం కలికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మ‌నంద‌రం కూడా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌డంతోపాటు ప్ర‌జ‌లు కూడా పాటించేలా ప్రోత్స‌హిద్దామ‌ని ఆయ‌న ఈశాన్య రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు సూచించారు. క‌రోనా సెకండ్ వేవ్‌లా థ‌ర్డ్ వేవ్ కూడా విజృంభించ‌కుండా నిలువ‌రించాలంటే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం కావాల‌ని ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు.