Rare Species Seized : చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. అరుదైన పాములు, కోతులు, తాబేళ్లు స్వాధీనం

చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరుదైన జీవ జాతులను అక్రమంగా తరలిస్తూ ఓ స్మగ్లర్ పట్టుపడ్డాడు. అతని రెండు బ్యాగుల్లో అరుదైన పాములు, కోతులు, తాబేళ్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

Rare Species Seized : చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. అరుదైన పాములు, కోతులు, తాబేళ్లు స్వాధీనం

Rare creatures (1)

Rare Species Seized : చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరుదైన జీవ జాతులను అక్రమంగా తరలిస్తూ ఓ స్మగ్లర్ పట్టుపడ్డాడు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్ దగ్గర అరుదైన జీవులను గుర్తించారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని రెండు బ్యాగుల్లో అరుదైన జీవజాతులు కనిపించాయి.

Gold Seized : బ్యాండేజీల్లో దాచుకుని బంగారం అక్రమ తరలింపు

వీటిలో 45 బాల్ పైథాన్ లు, మూడు కుచ్చుతోక కోతులు, మూడు నక్షత్ర తాబేళ్లు, ఎనిమిది కార్న్ స్నేక్స్ లభించాయి. కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని, తిరిగి బ్యాంకాక్ కు పంపించారు. అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.