Fire In Bihar: ఔరంగాబాద్‌లో పేలిన సిలీండర్.. 30మందికి గాయాలు.. ఛత్ పూజ సందర్భంగా ఘటన

సిలీండర్ పేలిన ఘటనలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Fire In Bihar: ఔరంగాబాద్‌లో పేలిన సిలీండర్.. 30మందికి గాయాలు.. ఛత్ పూజ సందర్భంగా ఘటన

Fire In Bihar

Fire In Bihar: బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో 30మందికి గాయాలయ్యాయి. వీరిలో ఏడుగురు పోలీసులు ఉన్నారు. ఛత్ మహాపర్వ్ (ఛత్ 2022) కోసం సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహిబ్‌గంజ్ ప్రాంతంలోని అనిల్ గోస్వామి ఇంట్లో శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఛత్ ప్రసాద్ తయారు చేస్తున్నారు. ఇంతలో గ్యాస్ లీకవడంతో ఇంట్లోని వారికి అర్థమయ్యేలోపే మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని మహిళలు బయటకు వచ్చారు. అనిల్ గోస్వామి, అతని కుమారుడు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.

World’s Tallest Lord Shiva Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం

మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రజలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపుచేసే క్రమంలో ఏడుగురు పోలీసులకు గాయలయ్యాయి. సిలీండర్ పేలిన ఘటనలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

MLAs trap issue : TRS ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భద్రత పెంపు .. బుల్లెట్ ప్రూఫ్ కారు,4+4 గన్‌మెన్లు కేటాయింపు

గాయపడిన వారిని సదర్ ఆసుపత్రిలో వైద్యచికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యంకోసం వేరే ఆస్పత్రికి తరలించారు. సిటీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ వినయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంఘటనకుగల కారణాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.