కేంద్రం కీలక నిర్ణయం: ఒకటే రాజధాని, ఒకే పరిపాలనా కేంద్రం

  • Published By: vamsi ,Published On : January 22, 2020 / 01:08 PM IST
కేంద్రం కీలక నిర్ణయం: ఒకటే రాజధాని, ఒకే పరిపాలనా కేంద్రం

ఒక వైపు పరిపాలన వికేంద్రీకరణ అంటూ జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న సమయంలో కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే విధంగా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకుంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకటే పరిపాలనా కేంద్రం చేస్తూ విలీనం చేసిన ఒకే పాలన కేంద్రాన్ని, రాజధానిని ఏర్పాటు చేసేందుకు డెసిషన్ తీసుకుంది కేంద్రప్రభుత్వం. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డయ్యూలకు డామన్‌ను పాలన కేంద్రంగా నియమించింది కేంద్రం 

ఈ మేరకు కేబినేట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రకాశ్.. ఇప్పటి వరకు ఈ రెండింటికి వేర్వేరుగా పరిపాలన కేంద్రాలు ఉన్నాయని, డామన్ డయ్యూకు డామన్ పాలన కేంద్రం కాగా.. దాద్రా నగర్ హవేలీకి సిల్వసా పరిపాలనా కేంద్రంగా ఉందని, ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 

ఈ మేరకు రూపొందించిన బిల్లును గత నెలలో పార్లమెంట్ ఆమోదించిందని ఇప్పుడు దానిని అమలు అ జనవరి 26 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే.. రెండింటికి డామన్‌ను పరిపాలన కేంద్రంగా ఉంచాలని నిర్ణయించారు. 2019 డిసెంబర్ 3న రెండు కేంద్ర పాలిత ప్రాంతాల విలీనం బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందగా.. కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ‌గా పిలవనున్నారు. పరిపాలన వికేంద్రీకరణ చెయ్యాలంటూ.. ఏపీకి మూడు రాజధానులు ఏర్పటు చెయ్యాలని జగన్ సర్కారు అడుగులు వేస్తున్న వేళ కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం విశేషం.