Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తగ్గిన రద్దీ.. వెయిటింగ్ టైమ్ ఐదు నిమిషాలే

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కొంతకాలంగా ఎదురవుతున్న ప్రయాణికుల రద్దీ సమస్య తగ్గింది. గతంలో 3-5 గంటలు పట్టే చెకింగ్ టైమ్, ఇప్పుడు ఐదు నిమిషాలు మాత్రమే పడుతోంది.

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తగ్గిన రద్దీ.. వెయిటింగ్ టైమ్ ఐదు నిమిషాలే

Delhi Airport: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్ 3 వద్ద కొంతకాలంగా రద్దీ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Uttar Pradesh: ప్రైవేటు బస్సు-ట్రక్కు ఢీ… ఆరుగురు మృతి.. 21 మందికి గాయాలు

గుంపులుగా ఉండటం, తోసుకోవడం, గొడవ పడటం, గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడం, ఈ కారణాల వల్ల విమానాలు మిస్సవడం వంటివి జరిగాయి. దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చాలా మంది సోషల్ మీడియాలో కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. చివరకు దీనిపై ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా కూడా స్పందించాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి ఆకస్మికంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టును సందర్శించారు. అక్కడి పరిస్థితుల్ని మెరగుపర్చేందుకు చర్యలు తీసుకున్నారు. అదనపు గేట్లను అందుబాటులోకి తేవడం, సెక్యూరిటీ చెకింగ్, లగేజీ చెకింగ్ త్వరగా అయ్యేలా టెక్నాలజీ వాడటం, అదనపు మెషీన్లు అందుబాటులోకి తేవడం, అదనపు సిబ్బందిని నియమించడం వంటి చర్యల ద్వారా ప్రయాణీకుల రద్దీని తగ్గించగలిగారు.

KTR-BRS: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోతున్న కేటీఆర్

గతంలో టెర్మినల్-3 నుంచి వచ్చే ప్రయాణికులు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు 3-5 గంటల సమయం పట్టేది. తాజాగా అధికారులు చేపట్టిన చర్యల వల్ల ఈ సమయం ఐదు నిమిషాలకు తగ్గింది. అన్ని గేట్ల ద్వారా వచ్చే ప్రయాణికులు ఐదు నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టులోకి చేరుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ప్రయాణికులు త్వరగా తమ చెకింగ్ పూర్తి కావాలంటే డిజియాత్ర యాప్ వాడాలని అధికారులు సూచించారు.